- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నాకు ఆ డైరెక్టర్ అంటే చాలా ఇష్టం.. ఆ పని చేయడం కోసం చేయి కోసుకుంటా.. ప్రియమణి షాకింగ్ కామెంట్స్

దిశ, సినిమా: అలనాటి హీరోయిన్ ప్రియమణి(Priyamani) మనందరికీ సుపరిచితమే. ‘ఎవరే అతగాడు’(Yevare Athagadu) సినిమాతో టాలీవుడ్‌కి హీరోయిన్‌గా పరిచయమైన ఈ భామ.. ‘పెళ్లైన కొత్తలో’(Pellaina Kothalo) మూవీతో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. ఆ తర్వాత ‘యమదొంగ’(Yamadonga), ‘నవ వసంతం’(Nava Vasantham), ‘హరే రామ్’(Hare Ram), ‘కింగ్’(King), ‘ద్రోణ’(Drona), ‘మిత్రుడు’(Mitrudu), ‘ప్రవరాఖ్యుడు’(Pravarakyudu), ‘శంభో శివ శంభో’(shambho Shiva Shambho), ‘సాధ్యం’(Sadhyam), ‘గోలీమార్’(Golimar), ‘రగడ’(Ragada), ‘రాజ్’(Raj), ‘క్షేత్రం’(Kshetram), ‘నారప్ప’(Narappa) వంటి సినిమాల్లో నటించి మెప్పించింది.
అయితే ఏమైందో ఏమో కానీ కొన్నాళ్లు సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి సౌత్‌లోనే కాకుండా బాలీవుడ్‌లో కూడా బిజీ అయిపోయింది ప్రియమణి. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా వెబ్ సిరీస్‌లలో కూడా నటిస్తూ మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం హిందీలో ‘ఫ్యామిలీ మ్యాన్ 3’(Family Man-3) అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది ప్రియమణి. ఇప్పటికే ఈ సిరీస్ సక్సెస్‌ఫుల్‌గా రెండు సీజన్స్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. త్వరలో మూడో సీజన్ కూడా విడుదల కానుందని తెలుస్తోంది.
ఇందులో మనోజ్ బాజ్‌పాయ్(Manoj Bajpay) హీరోగా నటిస్తుండగా తన భార్య పాత్రలో ప్రియమణి కనిపించనుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియమణి ఈ సిరీస్ గురించి అండ్ డైరెక్టర్ మణిరత్నం గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇందులో భాగంగా ఫస్ట్ ‘ఫ్యామిలీ మ్యాన్ 3’ గురించి మాట్లాడుతూ.. ‘‘ఈ 3వ సీజన్‌ను చూడడానికి నేను కూడా ఎదురుచూస్తున్నాను. నేను చాలా ఎగ్జైటెడ్‌గా ఉన్నాను. ఈ సీజన్ కూడా హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. సీజన్ 3 కోసం ఎదురు చూస్తూ ఉండండి.
ఇందులో మీరు ఊహించనివి చాలా జరుగుతాయి’’ అంటూ ప్రేక్షకుల్లో మరింత హైప్ పెంచేసింది ప్రియమణి.అలాగే మణిరత్నం గురించి మాట్లాడుతూ.. ‘నాకు డైరెక్టర్ మణిరత్నం (Maniratnam) అంటే చాలా ఇష్టం. గతంలో ఆయన దర్శకత్వంలో ‘రావన్’(Ravan) సినిమాలో నటించాను. ఆ సినిమాలో విక్రమ్(Vikram) చెల్లి పాత్రలో కనిపించాను. ఈ మూవీ కోసం మణి సార్ నుండి ఫోన్ రాగానే షాక్ అయ్యాను.
ఎందుకంటే నేను ఆయన సినిమాలో నటించడానికి చేయి కోసుకుంటా. మణిరత్నం సినిమాలో నటించడమే గొప్ప అదృష్టం. ఆయన చేసిన సినిమాలు, ఆయనకు ఉన్న ఎక్స్‌పీరియన్స్‌ను చూస్తే ఎలాగైనా ఆయన సినిమాల్లో నటించాలనే కోరిక పుడుతుంది. అది ఎలాంటి పాత్ర అయినా సరే’ అని చెప్పుకొచ్చింది ప్రియమణి. ప్రస్తుతం ఈ భామ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.