Naga Chaitanya: బ్రేకప్ బాధేంటో నాకు తెలుసు అంటూ సమంతతో విడాకులు గురించి చెప్పిన నాగ చైతన్య ( వీడియో)

by Prasanna |   ( Updated:2025-02-08 13:15:53.0  )
Naga Chaitanya: బ్రేకప్ బాధేంటో నాకు తెలుసు అంటూ సమంతతో విడాకులు గురించి చెప్పిన  నాగ చైతన్య (  వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్ : నాగ చైతన్య (Naga Chaitanya ) హీరోగా తెరకెక్కిన చిత్రం " తండేల్ " ( Thandel ). ఈ సినిమా ఫిబ్రవరి 7 న రిలీజ్ అయి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. చందు మొండేటీ దర్శకత్వం వహించిన ఈ సినిమాని గీతా ఆర్ట్స్‌పై నిర్మించారు. అల్లు అరవింద్ (Allu Aravind) బడ్జెట్ విషయంలో ఎక్కడా తగ్గలేదు. శ్రీకాకుళంలో మత్య్సకారుల యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాని రూపొందించారు. అయితే, ప్రమోషన్స్‌లో చైతూ ఎంత కష్టపడ్డాడో మనందరికీ తెలిసిందే.

వీరిద్దరూ కలిసి చేసిన ప్రమోషన్స్ జనాల్లోకి బాగా వెళ్ళాయి. ప్రస్తుతం, ఎక్కడా చూసిన సినిమాకి పాజిటివ్ టాక్ వినబడుతోంది. ఈ వారం మొత్తం తండేల్ జోరే కనిపించేలా ఉంది. ఒక్క హిట్ కోసం మూడేళ్ళ నుంచి ఎదురు చూశాడు. చైతూ పడిన కష్టానికి తగిన ప్రతి ఫలం వచ్చింది. ఈ తండేల్ ప్రమోషన్స్‌లో భాగంగా మాట్లాడిన ఓ పాడ్ కాస్ట్ వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

" బ్రేకప్ జరిగితే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. నేను కూడా అనుభవించాను. నేనూ కూడా ఓ బ్రోకెన్ కుటుంబం నుంచే వచ్చాను.. మేము ఒక నైట్ లో ఈ నిర్ణయం తీసుకోలేదు.. ఇంత పెద్ద డెషిషన్ తీసుకునేముందు వెయ్యి సార్లు ఆలోచించాం.. ఇది కరెక్ట్ యేనా లేక కాదా అని. మేము ఇద్దరం ఇష్టపడే విడిపోయాం.. ఇప్పుడు ఎవరి పనుల్లో వారు బిజీ అయ్యాము.. ఎవరి జీవితాలు వాళ్లు చూసుకుంటున్నాము. అసలు, ఇలాంటి నిర్ణయం తీసుకునే పరిస్థితి వరకు తెచ్చుకోకూడదు.. కానీ అలా చేయాల్సి వచ్చింది.. ఏం జరిగినా ప్రతి దానికి ఓ కారణం ఉంటుంది " అంటూ ఇలా నాగ చైతన్య ( Naga Chaitanya ) తన మొదటి భార్య సమంతతో ( Samantha ) జరిగిన డివోర్స్ గురించి చెప్పుకొచ్చాడు.

" అలాగే, మూవీ టైంలో కచ్చితంగా డబ్బులు ఖర్చు చేయాలని, నెలనెలా పీఆర్ కోసం లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుందని నాగ చైతన్య అంటున్నాడు. ఇది మన సినిమా అనుకుని .. అందరికీ తెలియజేయాలి.. దాన్ని మనమే ప్రమోట్ చేసుకోవాలి.. ముందుకు పుష్ చేసుకోనే బాధ్యత కూడా మనదే .. పాజిటివిటీ క్రియేట్ చేసుకోవాలి.. లేదంటే ఇక్కడ చాలా కష్టం " అంటూ నాగ చైతన్య తన మాటల్లో చెప్పుకొచ్చాడు.

Next Story