- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సొంత ఇల్లు కట్టుకున్నప్పుడు కూడా ఇంత హ్యాపీగా ఫీల్ అవ్వలేదు.. స్టార్ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(surya) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా అభిమానులను సొంతం చేసుకుంటున్నాడు. తెలుగులో డబ్బింగ్ సినిమాల్లో మాత్రమే నటించి ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నాడు. రీసెంట్‌గా ‘కంగువ’(Kanguva) సినిమాతో ఓకే ఓకే అనిపించుకున్న సూర్య.. ప్రస్తుతం ‘రెట్రో’(Retro) మూవీతో మన ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్(Karthik Subbaraj) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే(Pooja Hegde) హీరోయిన్‌గా నటిస్తుంది.
ఇక ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ కార్మిక దినోత్సవం సందర్భంగా మే1న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇక ఈ మూవీ తర్వాత ఆయన దర్శకుడు, నటుడు ఆర్.జె. బాలాజీ(RJ Balaji) దర్శకత్వం వహిస్తున్న సూర్య 45వ చిత్రంలో నటిస్తున్నాడు. అలాగే స్టార్ డైరెక్టర్ చందూ మొండేటీతో కూడా ఓ మూవీ చేయబోతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. నటుడు సూర్య అగరం ఫౌండేషన్(Agaram Foundation) అనే విద్యా స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆదివారం చెన్నై(Chennai)లో అగరం ఫౌండేషన్ కొత్త కార్యాలయం ప్రారంభోత్సవానికి సూర్య హాజరయ్యారు.
ఇక అక్కడ సూర్య మాట్లాడుతూ.. “నేను నా సొంత ఇల్లు కట్టుకున్నప్పుడు కూడా ఇంత ఆనందాన్ని ఎప్పుడూ అనుభవించలేదు. కానీ ఈ కొత్త కార్యాలయ ప్రారంభోత్సవానికి హాజరు కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే, నేను ఈ భవనాన్ని విరాళాల డబ్బుతో నిర్మించలేదు, నా సినిమాల ద్వారా వచ్చిన ఆదాయంతో ఈ కొత్త కార్యాలయాన్ని నిర్మించాను.
దాతలు ఇచ్చే డబ్బు పూర్తిగా విద్యకే ఖర్చు అవుతుంది. విద్యయే దేవుడు, విద్య ఎవరికైనా ఒక కవచం అని సూర్య చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా ఫిబ్రవరి 16న చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమానికి సూర్య తన కుమారుడు దేవ్, కూతురు దియా, భార్య జ్యోతికతో కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.