సినీ ప్రియులకు భారీ గుడ్ న్యూస్.. కేవలం రూ. 99తో మల్టీఫ్లెక్స్‌లలో సినిమా..

by Kavitha |   ( Updated:2024-09-18 14:15:16.0  )
సినీ ప్రియులకు భారీ గుడ్ న్యూస్.. కేవలం రూ. 99తో మల్టీఫ్లెక్స్‌లలో సినిమా..
X

దిశ, వెబ్‌డెస్క్: సినీ ప్రియులకు బంపర్ ఆఫర్. ఈ సంవత్సరం జాతీయ సినిమా దినోత్సవం సెప్టెంబర్ 20, 2024 న జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మీరు కేవలం రూ. 99తో మీకు ఇష్టమైన మూవీని చూడవచ్చు. ఈ నేపథ్యంలో మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (MAI) దేశవ్యాప్తంగా 4 వేలకు పైగా స్క్రీన్లలో కేవలం 99 రూపాయలకే మీకు నచ్చిన సినిమాను వీక్షించవచ్చు అని ఓ ప్రకటన చేసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది.

ప్రస్తుతం ఫ్యామీలీ మొత్తం కలిసి మూవీకి వెళ్లాలంటే మినిమం రూ. 1000 అవుతోంది. అదే మల్టీప్లెక్స్‌లో సినిమా చూడాలంటే రెండు మూడు వేలు ఖర్చు చేయాల్సిందే. అలాంటిది కేవలం రూ.99కే మల్టీప్లెక్స్‌(Multiflex)లో సినిమా చూసే అవకాశం వచ్చింది. అయితే ఇందులో ఓ ట్విస్ట్ కూడా ఉంది. అదేంటంటే.. ఇది 3D, రెక్లైనర్లు, ప్రీమియం ఫార్మాట్‌ లను కలిగి ఉండదు. అయితే., సెప్టెంబర్ 20న దాదాపు అన్ని థియేటర్లు టికెట్ బుకింగ్ ప్రక్రియలో తమ కస్టమర్లకు రూ.99 ఆఫర్ చేయనున్నాయి. ఈ ఆఫర్ ప్రస్తుతం ఉన్న సినిమాలకు బాగా ప్లస్ కానున్నాయి. అంతేకాకుండా కొన్ని పాత క్లాసిక్ సినిమాలను కూడా రీ రిలీజ్ చేయనున్నాయి.

కాగా రూ.99 టికెట్‌ల ఆఫర్‌ను పొందడానికి మీ లొకేషన్‌ని ఎంచుకుని సెప్టెంబర్ 20 తేదిని ఎంచుకుని ఆపై మీరు చూడాలనుకుంటున్న సినిమా పేరును ఎంచుకోండి. దీని తర్వాత బుక్ యువర్ టికెట్ ఆప్షన్‌కు వెళ్లి మీ సీటును బుక్ చేసి, మనీ పే చేయండి. ఇది కాకుండా సమీపంలోని థియేటర్‌కి వెళ్లి మూవీ పేరు చెప్పి రూ.99 టికెట్ కూడా కొనుగోలు చేయవచ్చు.

(video link credits to taran adarsh X account)

Advertisement

Next Story

Most Viewed