మహాకుంభమేళాకు వెళ్లిన హీరోయిన్.. నేను చేసిన పాపాలన్నీ కొట్టుకుపోయాయంటూ పోస్ట్

by Hamsa |   ( Updated:2025-01-30 09:55:17.0  )
మహాకుంభమేళాకు వెళ్లిన హీరోయిన్.. నేను చేసిన పాపాలన్నీ కొట్టుకుపోయాయంటూ పోస్ట్
X

దిశ, సినిమా: ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకైన మహా కుంభమేళా(Kumbh Mela) అత్యంత వైభవోపేతంగా జరుగుతోంది. దేశ విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కుని చేరుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అంతేకాకుండా త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. ఇందులో సామాన్యులతో పాటు సినీ సెలబ్రిటీలు సైతం పాల్గొంటున్నారు. పవిత్ర కుంభమేళాకు వెల్లి స్నానం చేస్తున్నారు. ఇక జనవరి 29న మౌని అమావాస్య సందర్భంగా దాదాపు ఎనిమిది నుంచి పది కొట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించిన విషయం తెలిసిందే. అయితే చాలామంది కుంభమేళాలో స్నానం చేయడం వల్ల అన్ని పాపాలు తొలగిపోతాయని అంతా భావిస్తున్నారు.

అందుకే కుంభమేళాకు భక్తులు పొటేత్తుతున్నారు. ఇప్పటికే కుంభమేళకు బీజేపీ ఎంపీ, నటి హేమమాలిని(Hema Malini), డైరెక్టర్ కబీర్ ఖాన్(Kabir Khan), కమెడియన్ సునీల్ గ్రోవర్, కొరియోగ్రాఫర్ రెమో డిసౌజా, మరాఠీ డైరెక్టర్ ప్రవీణ్ తర్దే(Praveen Tarde) వంటి వారు వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా, హీరోయిన్ పూనమ్ పాండే(Poonam Pandey) కూడా ఈ జాబితాలో చేరింది. కుంభమేళాకు వెళ్లి పుణ్య స్నానం ఆచరించి వార్తల్లో నిలిచింది. ఈ ఫొటోలను, వీడియోలను షేర్ చేస్తూ.. ‘‘నా పాపాలన్నీ కొట్టుకుపోయాయి. జీవితాన్ని దగ్గరగా చూశాను. అక్కడ 70 ఏళ్ల వృద్ధుడు చెప్పులు లేకుండా గంటల తరబడి నడుస్తాడు. అక్కడ విశ్వాసానికి హద్దులు లేవు. కుంభమేళాలో తమ ప్రాణాలను కోల్పోయిన వారికి మోక్షం దొరుకుతుందని ఆశిస్తున్నాను.

ఇక్కడి భక్తి నన్ను మూగబోయేలా చేసింది’’ అని రాసుకొచ్చింది. అయితే ఇటీవల ప్రయాగ్‌రాజ్‌లో తొక్కిసలాట జరగడంతో చాలామంది మరణించిన విషయం తెలిసిందే. దీనిపై కూడా ఈ వివాదాస్పద బ్యూటీ స్పందించింది. ప్రస్తుతం పూనమ్ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. ఈ విషయం తెలుసుకున్న వారు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఆమెను ట్రోల్ చేయడం ప్రారంభించారు. కాగా, పూనమ్ పాండే పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. మరీ ముఖ్యంగా ఆమె నిత్యం సోషల్ మీడియాలో పెట్టే పోస్టుల ద్వారా ఫుల్ క్రేజ్ తెచ్చుకుందనడంలో అతిశయోక్తి లేదు. వివాదాస్పద నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె నిత్యం ఏదో ఒక పోస్టుతో నెట్టింట రచ్చ చేస్తుంటుంది. ఇటీవల ఆమె మృతి చెందినట్లు వచ్చిన ఓ పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేసిన విషయం తెలిసిందే.


Next Story

Most Viewed