Apsara Rani: సినిమాలు వదిలేయాలనుకున్న టైంలో ఆ దేవుడే వీళ్లని పంపాడు.. యంగ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

by sudharani |
Apsara Rani: సినిమాలు వదిలేయాలనుకున్న టైంలో ఆ దేవుడే వీళ్లని పంపాడు.. యంగ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: అప్సరా రాణి (Apsara Rani), విజయ్ శంకర్ (Vijay Shankar), వరుణ్ సందేశ్ (Varun Sandesh) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘రాచరికం’. సురేశ్ లంకలపల్లి దర్శకత్వం వహించిన ఈ మూవీని ఈశ్వర్ నిర్మాతగా చిల్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన కంటెంట్, పాటలు, పోస్టర్లు, టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. ఈ క్రమంలోనే పాజిటివ్ ఎక్స్‌పెక్టేషన్స్ మధ్యలో ‘రాచరికం’ చిత్రం జనవరి 31న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా తాజాగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు చిత్ర బృందం. ఈ సందర్భంగా హీరోయిన్ అప్సరా రాణి షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఆమె మాట్లాడుతూ.. ‘‘రాచరికం’ మూవీ జనవరి 31న రాబోతోంది. ఈ సినిమాలో ఇంత మంచి పాత్రను నాకు ఇచ్చిన సురేశ్, ఈశ్వర్‌కి చాలా థాంక్స్. ఒకే రకమైన పాత్రలు వస్తున్నాయని సినిమాలు వదిలేయాలని అనుకున్నా. ఆ టైంలోనే ఆ దేవుడు వీళ్లని నా దగ్గరకు పంపించాడు. విజయ్ శంకర్‌తో నటించడం ఆనందంగా ఉంది. సురేశ్ ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించారు. ఈ చిత్రం చాలా బాగా వచ్చింది. ఈ మూవీ అందరికీ నచ్చుతుంది. జనవరి 31న మా సినిమాను అందరూ చూడండి’ అని చెప్పుకొచ్చింది.

Next Story