‘గేమ్ ఛేంజర్’పై హీరోయిన్ అంజలి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. సినిమా విషయంలో నేను హ్యాపీగా ఉన్నానంటూ..

by Kavitha |
‘గేమ్ ఛేంజర్’పై హీరోయిన్ అంజలి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. సినిమా విషయంలో నేను హ్యాపీగా ఉన్నానంటూ..
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్(Shankar) కాంబోలో వచ్చిన ‘గేమ్ ఛేంజర్’(Game Changer) సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 10న థియేటర్లలో రిలీజ్ అయి మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు(Dil Raju) నిర్మాణంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ మూవీలో కియారా అద్వాని(Kiara Adwani) హీరోయిన్‌గా నటించింది. అలాగే అంజలి(anjali), సునీల్(Sunil), సముద్ర ఖని(Samudrakani), ఎస్ జె సూర్య(Sj Surya) వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించారు. అయితే భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది అనుకున్నారు అందరూ, కానీ ఊహించని విధంగా ఈ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.

ఈ క్రమంలో హీరోయిన్ అంజలి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విశాల్(Vishal) హీరోగా అంజలి, వరలక్ష్మి శరత్ కుమార్(Varalakshmi Sarathkumar) హీరోయిన్లుగా నటించిన తాజా మూవీ ‘మద గజ రాజా’(Madagajaraja). ఇటీవల సంక్రాంతి కానుకగా తమిళ్‌లో రిలీజ్ అయిన ఈ చిత్రం ఇప్పుడు తెలుగులో జనవరి 31న రిలీజవుతోంది. అయితే తాజాగా ఈ మూవీ ఈవెంట్ నిర్వహించగా.. దానికి అంజలి, వరలక్ష్మి వచ్చారు. ఈ క్రమంలో అంజలికి ‘గేమ్ ఛేంజర్’ సినిమా ఫలితం గురించి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. దీనిపై అంజలి స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. ‘ఒక యాక్టర్‌గా నేను నా రెస్పాన్సిబిలిటీని పూర్తిచేశాను. ఈ పాత్రకు నేను 200 శాతం పనిచేశాను.

అదే నా బాధ్యత. సినిమాని ఆడించడానికి ప్రమోషన్స్ చేస్తాం, జనాల దగ్గరకు వెళ్తాము అవన్నీ చేశాము. ఈ మూవీని నేను చాలా నమ్మాను. ఈ సినిమా విషయంలో నేను హ్యాపీనే. ఎందుకంటే గేమ్ ఛేంజర్ చూసిన జనరల్ ఆడియన్స్ ఎవరూ ఈ చిత్రం బాగోలేదని చెప్పలేదు. ఒక మంచి సినిమా చూశాం అని చెప్పారు. అయితే సినిమా బాగుండటం వేరు.. మంచి సినిమా వేరు. గేమ్ ఛేంజర్ మంచి సినిమా, మీరు చాలా బాగా చేశారు అని చెప్పారు. నాకు అది చాలు. కానీ, ఇలా జరిగితే కొన్ని సార్లు బాధపెడుతోంది’ అని అంజలి చెప్పుకొచ్చింది.

దీంతో ఆమె కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా గేమ్ ఛేంజర్ మూవీ తర్వాత రామ్ చరణ్ ప్రస్తుతం ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సనా(Buchibabu Sanaa) డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నాడు. ‘Rc-16’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక జాన్వీ ఎన్టీఆర్(NTR) నటించిన ‘దేవర’(Devara) మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సంగతి తెలిసిందే.

Next Story

Most Viewed