- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నేను టైమ్‌లెస్ స్టోరీలో టైమ్‌లెస్ రోల్ చేయవలసి వచ్చింది.. షాకింగ్‌గా దుల్కర్ సల్మాన్ పోస్ట్

దిశ, సినిమా: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) ప్రజెంట్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఆయన నటిస్తున్న చిత్రాల్లో ‘కాంత’(Kaantha) ఒకటి. సెల్వమణి సెల్వరాజ్ (Selvamani Selvaraj)దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో రానా దగ్గుబాటి(Rana Daggubati) కీలక పాత్రలో కనిపించనుండగా.. ఆయనే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. వేఫరెర్ ఫిలిమ్స్, స్పిరిట్ మీడియా సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే (Bhagyashree Borse) హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక ఇటీవల దుల్కర్ సల్మాన్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం అనౌన్స్‌మెంట్ పోస్టర్ రిలీజ్ చెయ్యగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.
ఇక ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తి చేసుకుందని తెలుస్తుండగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు సరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ‘కాంత’కు సంబంధించి మరో అప్‌డేట్ ఇచ్చారు దుల్కర్. ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ.. ‘నేను టైమ్‌లెస్ స్టోరీలో టైమ్‌లెస్ రోల్ చేయవలసి వచ్చింది.. పరిశ్రమలో నా 13 ఏళ్లను జరుపుకోవడానికి ఇంతకంటే పెద్ద బహుమతి నాకు ఏది లేదు. కాంత టీమ్ మొత్తానికి అండ్ ఏ నటుడైనా తన కలలు నెరవేర్చుకునేంత ప్రేమ అండ్ ప్రోత్సాహాన్ని నాకు అందించిన అద్భుతమైన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’ అంటూ పోస్టర్ రిలీజ్ చేశాడు. ఈ పోస్టర్‌లో దుల్కర్ స్టైలిష్ అండ్ సీరియస్ లుక్‌లో కనిపిస్తు ఆకట్టుకుంటున్నాడు.