Pushpa 2: ఏపీలో పుష్ప టికెట్ రేట్లు పెంపుకు గ్రీన్ సిగ్నల్ .. ఎంత పెరిగాయో తెలుసా?

by Prasanna |
Pushpa 2: ఏపీలో పుష్ప టికెట్ రేట్లు పెంపుకు గ్రీన్ సిగ్నల్ ..  ఎంత పెరిగాయో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun) హీరోగా తెరకెక్కిన సినిమా పుష్ప 2 ( Pushpa 2). ఈ మూవీ డిసెంబర్ 5న విడుదల చేస్తున్నారు. భారీ బడ్జెట్ మూవీ కావడంతో టికెట్ రేట్లు కూడా అదే రేంజ్లో పెంచుతున్నారు. మూవీ మీద హైప్ కూడా ఉండటంతో పుష్ప 2 టికెట్స్ కు భారీ డిమాండ్ ఏర్పడింది. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం పుష్ప 2 టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇచ్చింది. తాజాగా, ఏపీ ప్రభుత్వం కూడా టికెట్ రేట్ల పెంపుకు ఓకే చెప్పింది. దీనికి హీరో అల్లు అర్జున్ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ కూడా చేశాడు.

డిసెంబర్ 4 రాత్రి 9.30 గంటల ప్రీమియర్ షోకు అనుమతి ఇచ్చారు. ఈ షోకు టికెట్ ధరపై రూ. 800 వందల రూపాయల వరకు పెంచుకునేలా అనుమతి ఇచ్చారు. డిసెంబర్ 5 వ తారీఖున అన్ని స్క్రీన్స్ లో ఆరు షోలకు అనుమతి ఇచ్చారు. సింగిల్ స్క్రీన్స్ అప్పర్ క్లాసుకు రూ.150, లోయర్ క్లాసుకు రూ.100, మల్టీప్లెక్స్ లో రూ.200 వరకు పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిసెంబర్ 5 నుంచి డిసెంబర్ 17 వరకు 5 షోలకు పర్మిషన్ ఇస్తూ సింగిల్ స్క్రీన్స్ అప్పర్ క్లాసుకు రూ.150, లోయర్ క్లాసుకు రూ.100, మల్టీప్లెక్స్ లో రూ.200 పెంచుకునేలా అనుమతి ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed