- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

దిశ, వెబ్‌డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘నానా హైరానా’ ఫుల్ సాంగ్(NaaNaa Hyraanaa Song)ను గేమ్ ఛేంజర్(Game Changer) చిత్రబృందం విడుదల చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. కాగా, ఈ పాటను ఇన్‌ఫ్రారెడ్ కెమెరాతో షూట్ చేయడం విశేషం. ఇన్‌ఫ్రారెడ్ కెమెరా(Infrared Camera)తో షూట్ చేయడం తెలుగు, తమిళ్‌లోనే కాదు.. భారత సినీ చరిత్రలో తొలిసారి. ఈ పాట షూటింగ్ మొత్తం న్యూజిలాండ్‌లో జరిపారు. ఇదిలా ఉండగా.. తమిళ దిగ్గజ దర్శకుడు శంకర్ సినిమాలన్నీ దాదాపు భారీ బడ్జెట్ సినిమాలే. ఆయన తీసే సినిమాలు ఒకదానికి మించి మరొకటి ఉంటాయి. కేవలం పాటలకే కోట్లు ఖర్చు చేస్తుంటాడు. గేమ్ ఛేంజర్ సినిమాలోని పాటలకు కూడా దాదాపు రూ.75 కోట్లు ఖర్చు పెట్టినట్లు వార్తలు వినిపించాయి.
ఇక నానా హైరానా పాట(NaaNaa Hyraanaa Song)కు రూ.10 కోట్లకు ఖర్చు చేయడం గమనార్హం. అందుకే ఈ పాట రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు స్పెషల్. థియేటర్లలో మొదటి రెండు రోజులు సినిమా చూసిన అభిమానులు ఈ పాటను మిస్ అయ్యారు. అందుకే ఈ పాటను చిత్రబృందం మిగతా పాటల కంటే ముందు విడుదల చేసింది. కాగా, రామ్‌చరణ్ (Ram Charan) హీరోగా దర్శకుడు శంకర్(Shankar) తెరకెక్కించిన ఈ గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ(Kiara Advani) హీరోయిన్‌గా నటించింది. శ్రీకాంత్(Srikanth), అంజలి(Anjali), ఎస్‌జే సూర్య, జయరాం, సునీల్, బ్రహ్మానందం వంటి దిగ్గజ నటులు కీలక పాత్రల్లో నటించారు. జనవరి 10న ఆడియన్స్ ముందుకు వచ్చింది. మిక్స్‌డ్ టాక్ వచ్చింది.