అభిమానులకు గుడ్ న్యూస్..! న్యూ ఇయర్ ట్రీట్‌గా ‘గేమ్ ఛేంజర్’ ట్రైలర్ వచ్చేస్తుందోచ్.. పోస్ట్ వైరల్

by Kavitha |   ( Updated:2025-01-02 15:29:26.0  )
అభిమానులకు గుడ్ న్యూస్..! న్యూ ఇయర్ ట్రీట్‌గా ‘గేమ్ ఛేంజర్’ ట్రైలర్ వచ్చేస్తుందోచ్.. పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబోలో రాబోతున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. దిల్ రాజు నిర్మాణంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ మూవీలో కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే అంజలి, సునీల్, సముద్ర ఖని, ఎస్ జె సూర్య కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 10న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానున్నది.

ఇక రిలీజ్ డేట్ దగ్గర పడటంతో మూవీ టీమ్ ప్రమోషన్ల జోరులో ఉన్నారు. ఈ క్రమంలో ఓ న్యూస్ నెట్టింట వైరల్‌ అవుతోంది. న్యూ ఇయర్ ట్రీట్‌గా గేమ్ ఛేంజర్ నుంచి ట్రైలర్ రాబోతున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో బాగా హల్‌చల్ చేస్తోంది. ఇక కొత్త సంవత్సరం కానుకగా రామ్ చరణ్ మూవీ ట్రైలర్ రాబోతుందని తెలిసి మెగా ఫ్యాన్స్ ఫుల్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed