- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Ram Charan: నిఖిల్ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ భారీ ప్రాజెక్ట్..!

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ఆర్ఆర్ఆర్, రంగస్థలం వంటి చిత్రాలతో ఘన విజయాలు అందుకున్నారు. ఇక ఇటీవల రామ్ చరణ్, శంకర్(Shankar) కాంబోలో వచ్చిన ‘గేమ్ చేంజర్’ మూవీ భారీ అంచనాల మధ్య థియేటర్స్‌లో విడుదలై బాక్సాఫీసు వద్ద రాణించలేకపోయింది. ప్రస్తుతం గ్లోబల్ స్టార్, బుచ్చిబాబు (Buchibabu)దర్శకత్వంలో ‘RC-16’ సినిమా చేస్తున్నారు. అయితే ఇందులో జాన్వీ కపూర్(Janvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఇందులో శివ రాజ్ కుమార్(Shiva Raj Kumar), జగపతి బాబు(Jagapathi Babu) కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అయితే ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers), వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు.
దీనికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలో.. తాజాగా, రామ్ చరణ్ బాలీవుడ్ డైరెక్టర్‌తో ఓ భారీ ప్రాజెక్ట్ చేయనున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. గత ఏడాది హిట్ మూవీ ‘కిల్’ తెరకెక్కించిన నిఖిల్ నగేష్(Nikhil Nagesh) దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమా చేస్తున్నట్లు టాక్. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతున్నాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు టాలీవుడ్ వాల్లని వదిలేసి బాలీవుడ్ డైరెక్టర్స్‌పై రామ్ చరణ్ ఫోకస్ పెట్టాడా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.