Ravi Teja: రవన్న మాస్ దావత్ షురూ.. అప్డేట్ వచ్చేస్తుందంటూ పోస్టర్ షేర్ చేసిన మేకర్స్

by Hamsa |
Ravi Teja: రవన్న మాస్ దావత్ షురూ.. అప్డేట్ వచ్చేస్తుందంటూ పోస్టర్ షేర్ చేసిన మేకర్స్
X

దిశ, సినిమా: మాస్ మహారాజా రవితేజ(Ravi Teja) గత ఏడాది మిస్టర్ బచ్చన్(Mr. Bachchan), ఈగల్ వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ రెండు సినిమాలు బాక్సాఫీసు వద్ద హిట్ అందుకోలేకపోయాయి. దీంతో తన నెక్ట్స్ మూవీతో ఎలాగైనా విజయాన్ని సాధించాలనే ప్లాన్‌లో ఉన్నారు. ప్రస్తుతం రవితేజ, భాను బోగ వరపు(Bhanu Bogavarapu) దర్శకత్వంలో ‘మాస్ జాతర’ సినిమా చేస్తున్నారు.

ఇందులో క్రేజీ బ్యూటీ శ్రీలీల(Sreeleela) హీరోయిన్‌గా నటిస్తుంది. అయితే దీనిని శ్రీకర స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్(Sitara Entertainments), షార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ(Naga Vamsi), సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. దీనికి బలగం ఫేమ్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. అయితే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ క్రమంలో.. తాజాగా, ‘మాస్ జాతర’ చిత్రం నుంచి అప్డేట్ రాబోతున్నట్లు మేకర్స్ అధికారిక ప్రకటనను విడుదల చేశారు.

రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ రాబోతున్నాయని తెలుపుతూ రవితేజ పోస్టర్‌ను వదిలారు. ఇందులో ఆయన భోజనం చేసేందుకు కూర్చుని కోర మీసం మెలేస్తూ కనిపించారు. చుట్టుపక్కల విలన్స్ ఉండగా.. కొందరిని చితక్కొట్టి.. ముందు ఆహార పదార్థాలు పెట్టుకుని కూర్చుని ఉన్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ మాస్ మహారాజా అభిమానుల్లో అంచనాలు పెంచుతోంది. మాస్ జాతరతో ఫుల్ మీల్స్ ఖాయం అని లుక్ చెప్పకనే చెబుతోంది.

Next Story

Most Viewed