బాలీవుడ్ ఇండస్ట్రీని వీడిన డైరెక్టర్.. అక్కడ అలాంటి పనులు చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు!

by Hamsa |
బాలీవుడ్ ఇండస్ట్రీని వీడిన డైరెక్టర్.. అక్కడ అలాంటి పనులు చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు!
X

దిశ, సినిమా: బాలీవుడ్ డైరెక్టర్, నటుడు అనురాగ్ కశ్యప్(Anurag Kashyap) పలు సినిమాలు తెరకెక్కించి ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నారు. ముఖ్యంగా అనురాగ్ పలు వివాదాస్పద కామెంట్లు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. ఇటీవల బాలీవుడ్ ఆయన ఇండస్ట్రీపై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా, పూర్తిగా హిందీ ఇండస్ట్రీని వీడినట్లు తెలిపారు. ‘‘బాలీవుడ్ మొత్తం ఎంతో విష‌పూరితంగా మారింది. అక్కడి నిర్మాత‌ల ఆలోచ‌నలు చూసి నాకు పిచ్చెక్కిపోయింది. అందుకే ముంబైని, బాలీవుడ్‌ను వ‌దిలేసి సౌత్‌లో సెటిలవ్వాలని అనుకుంటున్నాను. అంతేకాదు, సౌత్‌లో చేసిన‌ట్టు బాలీవుడ్‌లో ఎక్స్‌పెరిమెంట్స్ చేయ‌రు. హిందీ చిత్ర ప‌రిశ్రమ చాలా దారుణంగా త‌యారైంది.

సినిమా మొద‌లుపెట్టిన రోజు నుంచే మూవీ ఎంత బిజినెస్ చేస్తుంద‌ని, సినిమాను ఎలా అమ్ముదాం, ఎంత లాభ‌మొస్తుంద‌ని బిజినెస్ యాంగిల్‌లోనే చూస్తున్నారు. దాని వ‌ల్ల డైరెక్టర్‌కు సినిమా తీసే ఆనందం మిస్ అవుతుంది. బాలీవుడ్‌లో ప్రతీ ఒక్కరూ అసాధ్యమైన టార్గెట్లతోనే మూవీస్‌ను స్టార్ట్ చేస్తున్నారు. మినిమం రూ.500 కోట్లు, రూ.800 కోట్లు క‌లెక్షన్స్ చేసే సినిమాల‌నే తీయాల‌ని అక్కడ నిర్మాత‌లు ఎక్కువ‌గా ప్రయ‌త్నిస్తుంటారు. దీంతో అక్కడ కొత్త టాలెంట్‌కు ఎక్కువ అవ‌కాశాలు రావ‌డం లేదు. బాలీవుడ్‌ను చూస్తే అస‌హ్యమేస్తుంద‌ని, తను తీసే సినిమాల‌కు డ‌బ్బులు రావ‌ని నిర్మాత‌లు అనుకుంటున్నారు. నా సినిమాను నిర్మాతలు న‌మ్మడం లేదు అందుకే అక్కడి నుంచి బ‌య‌ట‌కు వచ్చేశా. ఇక మీదట సౌత్ సినిమాల్లోనే కంటిన్యూ అవుతాను’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అనురాగ్ కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

Next Story

Most Viewed