Tandel Movie : ఉత్కంఠకు తెర.. ఎట్టకేలకు తండేల్ రిలీజ్ డేట్ అనౌన్స్..

by sudharani |   ( Updated:2024-11-05 14:28:03.0  )
Tandel Movie : ఉత్కంఠకు తెర.. ఎట్టకేలకు తండేల్ రిలీజ్ డేట్ అనౌన్స్..
X

దిశ, సినిమా:‘గీతా ఆర్ట్స్’ బ్యానర్ పై అల్లు అరవింద్ (Allu Aravind) సమర్పణలో బన్నీ వాస్ నిర్మిస్తున్న చిత్రం తండేల్ (Thandel). చందూ మొండేటి (Chandu Mondeti) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో నాగ చైతన్య (Naga Chaitanya), సాయి పల్లవి (Sai Pallavi) హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీత దర్శకుడు. భారీ బడ్జెట్‌తో సూపర్ కెమిస్ట్రీ కాంబినేషన్‌గా పేరొందిన జంట నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన అదిరిపోయే అప్ డేట్ ఇచ్చింది చిత్రబృందం. నేడు ప్రెస్‌మీట్ నిర్వహించిన మూవీ టీం.. తండేల్ రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న తండేల్ ప్రేక్షకుల ముందుకు రానుందని అనౌన్స్ చేసింది.

కాగా, ఈ తండేల్ మూవీ క్రిస్మస్‌కు వస్తుందని ప్రకటించింది చిత్రబృందం. కానీ దానిని వాయిదా వేస్తూ ఫిబ్రవరికి మార్చారు. అయితే తండేల్ సినిమా షూటింగ్ పూర్తి కాకపోవడంతోనే రిలీజ్ డేట్‌ను పొడిగించినట్లు ఫిల్మ్ నగర్ టాక్. మత్య్సకార కుటుంబంలో జరిగిన యథార్థ గాధ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎక్కువ భాగం సముద్రంలో షూట్ చేయాల్సి ఉంది. అయితే సముద్రం మీద తీయాల్సిన కొన్ని సీన్లకు ఇండియన్ నేవీ నుంచి అనుమతులు రానందు వల్లే ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్, ఇండియా దేశాల మధ్య కొన్ని సన్నివేశాలు ఉన్నాయని ఈ నేపథ్యంలోనే నేవీ నుంచి అనుమతులు లభించడం లేదని తెలుస్తోంది. ఏదిఏమైనా ఫిబ్రవరి 7న ‘తండేల్’ ప్రేక్షకుల నడుమ తాండవం ఆడనుంది.

Read more ...

నాగ చైతన్య ‘తండేల్’ సినిమా నుంచి అదిరిపోయే పోస్టర్ విడుదల

Advertisement

Next Story