- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Devi Sri Prasad: త్వరలోనే దేవిశ్రీ ప్రసాద్ పెళ్లి.. టాలీవుడ్ నిర్మాత ఆసక్తికర కామెంట్స్.. వీడియో వైరల్

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్(Devi Sri Prasad) ఎన్నో సాంగ్స్ కూడా పాడి ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నారు. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ లో భాగంగా తెలుగులో సైమా ఉత్తమ సంగీత దర్శకుడు విభాగంలో అత్యధికంగా 11 సార్లు నామినేట్ అయి ఏడుసార్లు అవార్డును సొంతం చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. టాలీవుడ్ స్టార్ హీరోలందరి సినిమాలకు మ్యూజిక్ అందించడంతో పాటుగా కొన్ని మాస్ సాంగ్ పాడి మ్యూజిక్ లవర్స్‌ను మెప్పించారు. ఇటీవల ‘పుష్ప-2’ కిస్సిక్ సాంగ్‌కు తన మ్యూజిక్‌తో హైప్ పెంచారు.
ఇక ఆయన పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. దేవిశ్రీ ప్రసాద్ 40 ఏళ్లు వచ్చినప్పటికీ ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్‌గానే ఉన్నారు. ఆయన తమ్ముడు వివాహం కావడంతో పాటు పిల్లలు కూడా ఉన్నారు. అయినప్పటికీ దేవి మాత్రం సింగిల్‌గానే ఉండిపోయారు. ఇక గత కొద్ది రోజుల నుంచి టాలీవుడ్ హీరోయిన్ చార్మీ(Charmi Kaur)తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు అప్పట్లు వార్తలు కూడా వచ్చినవిషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా, దేవిశ్రీ పెళ్లిపై టాలీవుడ్ నిర్మాత బన్నీ వాసు(Bunny Vasu) ఆసక్తికర కామెంట్స్ చేశారు.
‘‘తండేల్(Thandel) సినిమా ఇంత గొప్పగా రావడానికి కారణం దేవిశ్రీ ప్రసాద్. ఆయనను ఇంట్లో ముద్దుగా బుజ్జి అని పిలుస్తారు. మా సినిమాలో కూడా బుజ్జి తల్లి ఉంది. మా బుజ్జి ఇక్కడే ఉన్నాడు.. కానీ ఆ తల్లి ఎక్కడ ఉందో. మా పెళ్లిళ్లు అయి పిల్లలు కూడా పుట్టారు. కానీ దేశి బ్యాచిలర్‌గానే ఉన్నాడు. త్వరలోనే దేవికి కూడా పెళ్లి జరగాలి. ఆయన పిల్లలు కూడా మంచి మ్యూజిక్ డైరెక్టర్లు కావాలి’’ అని అన్నాడు. ఇక ఈ కామెంట్స్‌పై దేవి రియాక్ట్ అవుతూ.. పెళ్లి మన చేతుల్లో లేదు. రాసి పెట్టి ఉంటేనే జరుగుతుంది’’ అని సైగల్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
" #DeviSriPrasad uu .. మా అందరికి పెళ్లి అయిపోయాయి..
— Movies4u Official (@Movies4u_Officl) February 2, 2025
నీకు త్వరగా పెళ్లి అయ్యి.. పిల్లలు పుట్టి.. వాళ్ళు కూడా పెద్ద సంగీత దర్శకులు అవ్వాలి!!"
- #BunnyVas pic.twitter.com/O5UUpA6zq6