ఈ సాంగ్‌లోని ప్రతి ఒక్క లిరిక్ నీకు డెడికేట్ చేస్తున్నా.. శ్రీ లీల ఎమోషనల్ పోస్ట్

by Kavitha |
ఈ సాంగ్‌లోని ప్రతి ఒక్క లిరిక్ నీకు డెడికేట్ చేస్తున్నా.. శ్రీ లీల ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: ‘పెళ్లి సందడి’(Pelli Sandadi) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ శ్రీ లీల(Sree Leela) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన ఫస్ట్ మూవీతోనే ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది ఈ భామ. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఇక ఈ అమ్మడు డ్యాన్స్‌కి అయితే ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.

రీసెంట్ సుకుమార్(Sukumar) డైరెక్షన్‌లో అల్లు అర్జున్(allu Arjun) హీరోగా, రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్‌గా నటించిన పుష్ప-2(Pushpa-2) మూవీలో శ్రీలీల ‘కిస్సిక్’(Kissik) అనే ఐటెం సాంగ్‌లో చిందులేసింది. ఆ బ్యూటీ డాన్స్‌కి ఫుల్ మార్కులే పడ్డాయి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ.. నితిన్(Nithin) సరసన ‘రాబిన్ హుడ్’(Robbin Hood), రవితేజ(Raviteja) ‘మాస్ జాతర’, విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నటిస్తున్న ‘VD-12’, శివ కార్తికేయన్(Sivakarthikeyan) ‘పరాశక్తి’(Parasakthi) మూవీతో పాటు బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్(Ibrahim Ali Khan) సరసన ఓ హారర్ కామెడీ థ్రిల్లర్ సినిమాలో నటిస్తోంది.

అలా వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ చదువులోనూ యాక్టీవ్‌గా ఉంటూ తన పై చదువులు పూర్తి చేసుకుంటుంది. అంతేకాకుండా నిత్యం సోషల్ మీడియా(social Media)లోనూ నిత్యం యాక్టీవ్‌గా ఉంటూ తన హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారుకు హీట్ పుట్టిస్తోంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా శ్రీలీల తన ఇన్‌స్టా(Instagram) వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. అందులో తన అమ్మతో దిగిన ఫొటోలు షేర్ చేసింది. అంతేకాకుండా మనలోని ప్రాణం అమ్మ.. మనదైన ప్రాణం అమ్మ అనే పాటను షేర్ చేస్తూ.. “ఈ పాటలోని ప్రతి లిరిక్‌ని నీ కోసం అంకితం చేస్తున్నాను.

నువ్వు హాస్పిటల్‌లో పని చేస్తున్నప్పుడు నేను ల్యాండ్‌లైన్‌ నుంచి మీకు కాల్ చేసినప్పుడు చాలా కాలం పాటు ఈ పాట మీ రింగ్ టోన్‌గా ఉండేది. ఇప్పుడు నాకు షూటింగ్ నుంచి పరీక్షల వరకు కలిగే ప్రతి మైక్రోస్కోపిక్ ఎమోషన్ వరకు మీరు నాతో ఉన్న అనుభూతి వీటన్నిటిని దూరం చేస్తుంది. లవ్ యు అమ్మ.. హ్యాపీ హ్యాపీ బర్త్‌డే.. మీలో భాగం అయినందుకు చాలా గర్వంగా ఉంది” అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. శ్రీలీల వాళ్ల అమ్మకి బర్త్‌డే విసెష్ తెలుపుతున్నారు. మరి ఈ భామ పోస్టుపై మీరు ఓ లుక్ వేయండి.

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed