ఓటీటీలోకి ‘డాకు మహారాజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

by sudharani |
ఓటీటీలోకి ‘డాకు మహారాజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
X

దిశ, సినిమా: నందమూరి నటసింహం, గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ (Nandamuri Balakrishna)నటించిన తాజా చిత్రం ‘డాకు మహారాజ్’ (Daku Maharaj). సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోస్ సినిమాస్ బ్యానర్స్‌పై నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం (Director Bobby) వహించగా.. ఇందులో ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal), శ్రద్ధా శ్రీనాథ్(Shraddha Srinath) హీరోయిన్లుగా నటించారు. రిలీజ్‌కు ముందే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్ ఆకట్టుకోగా.. భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్స్‌లో విడుదలైంది. ఈ చిత్రం మొదటి షో నుంచి హిట్ టాక్‌ను సొంతం చేసుకుని ఘన విజయాన్ని అందుకుంది. అంతేకాకుండా భారీ కలెక్షన్లు రాబట్టి పలు రికార్డులు కొల్లగొట్టింది. ఇక ఈ చిత్రంలో బాలయ్య బాబుతో బోల్డ్ బ్యూటీ ఊర్వశీ రౌటేలా (Urvashi Rautela) చేసిన ‘దబిడి దిబిడి’కు సూపర్ క్రేజ్ వచ్చిన విషంయ తెలిసిందే. ఇదిలా ఉంటే.. ‘డాకు మహారాజ్’ చిత్రం ప్రజెంట్ ఓటీటీ రిలీజ్‌(OTT release)కు సిద్ధం అయినట్లు తెలుస్తోంది.

ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్(Netflix) సొంతం చేసుకోగా.. గతంలో ఫిబ్రవరి 9 నుంచి అందుబాటులోకి రానున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. కానీ ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు. ఈ క్రమంలోనే ‘డాకు మహారాజ్’ సినిమా ఓటీటీకి సంబంధించిన న్యూస్ ప్రజెంట్ నెట్టింట మరోసారి వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా థియేటర్‌లలో తెలుగు, హిందీ వెర్షన్ విడుదల కాగా.. ఓటీటీలోకి మాత్రం తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. దీనికి సంబంధించి డబ్బింగ్ వర్క్స్ కూడా ప్రస్తుతం జనరుగుతున్నాయట. అవి పూర్తి అయ్యేందుకు మరింత సమయం పట్టే చాన్స్ ఉండటంతో.. మార్చి 4వ తేదీకి ఓటీటీలో తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. అంతే కాకుండా దీనిపై త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఉండనుందని ఇన్ సైడ్ టాక్.

Next Story

Most Viewed