వంద కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టిన ‘డాకు మహారాజ్’.. 4 రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ ఎంతో తెలుసా.. (ట్వీట్)

by Kavitha |   ( Updated:2025-01-16 09:01:44.0  )
వంద కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టిన ‘డాకు మహారాజ్’.. 4 రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ ఎంతో తెలుసా.. (ట్వీట్)
X

దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ(Balakrishna), డైరెక్టర్ బాబీ కొల్లి(Bobby Kolli) కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’(Daaku Maharaj ). ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal, శ్రద్ధా శ్రీనాథ్(Shraddha Srinath) హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాని.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్(Sitara Entertainments) బ్యానర్‌పై సూర్య దేవర నాగవంశీ(Suryadevara Naga Vamsi), సాయి సౌజన్య(Sai Sowjanya) నిర్మించారు. ఇక ఈ చిత్రం భారీ అంచనాల నడుమ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుని బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టిస్తోంది.

ఈ క్రమంలో.. తాజాగా, ఈ సినిమాకు 4వ రోజు వచ్చిన కలెక్షన్స్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా రూ. 105 కోట్ల కలెక్షన్లు రాబట్టి వంద కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టేసింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం మేకర్స్ ట్వీట్ వైరల్ అవుతుండగా.. నందమూరి ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అవుతున్నారు. కాగా ఈ సినిమా హిట్ అవ్వాలంటే రూ.160 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించాలి. నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం వంద కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్లు సాధించింది. మ‌రో రెండు లేదా మూడు రోజుల్లో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్‌కు చేరుకుంటుందని సినీ విశ్లేష‌కులు చెబుతున్నారు.

Next Story

Most Viewed