కౌంట్‌డౌన్ స్టార్ట్.. ‘యూఐ’ మూవీ నుంచి రొమాంటిక్ పోస్టర్ విడుదల

by Hamsa |
కౌంట్‌డౌన్ స్టార్ట్.. ‘యూఐ’ మూవీ నుంచి రొమాంటిక్ పోస్టర్ విడుదల
X

దిశ, సినిమా: కన్నడ స్టార్ నటుడు ఉపేంద్ర(Upendra) స్వీయ దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం ‘యూఐ’(UI). అయితే ఈ చిత్రంలో రీష్మా నానయ్య(Reeshma Nanaiah ) హీరోయిన్‌గా నటిస్తుండగా.. జిషు సేన్‌గుప్త, సన్నీ లియోన్(Sunny Leone), నిధి సుబ్బయ్, మురళీ శర్మ(Murali Sharma) కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను కె.పి శ్రీకాంత్, అండ్ జీ. మనోహరన్(G. Manoharan) నిర్మిస్తున్నారు.

అయితే ఈ చిత్రం డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో.. మూవీ మేకర్స్ ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీ బిజీగా మారిపోయారు. తాజాగా, కౌంట్‌డౌన్ పోస్టర్‌ను షేర్ చేశారు. ఇంకో పది రోజుల్లో వార్నర్ విల్ రోర్ అంటూ హీరో, హీరోయిన్ కలిసి ఉన్న లుక్‌ను నెట్టింట పెట్టారు. ఇందులో ఉపేంద్ర కత్తి పట్టుకుని ఉండగా.. రీష్మా రోజ్ ఫ్లవర్ బోకే ఆయన చేతుల్లో వాలి నవ్వుతూ కనిపించింది. ప్రజెంట్ ఈ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Next Story