- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Brahmamudi: ధాన్యం దెబ్బకి కుప్పకూలిపోయిన సీతారామయ్య
దిశ, వెబ్ డెస్క్ : బ్రహ్మముడి ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్
‘ఆగండి .. మీరు అక్కడే ఆగండి.. నాకు న్యాయం చేయాల్సిందే..’ అంటూ ధాన్యం తాడును మెడకు చుట్టుకుని గొడవ చేస్తుంటుంది. ఈవిడ గారు చేసే హడావుడికి రుద్రాణి రెచ్చగొడుతుంది. ఇటు కావ్య, అటు అపర్ణా దేవి, స్వప్న, ఇందిరా దేవి ఇలా ఇంట్లో వాళ్ళు మొత్తం చెప్పినా కూడా వినదు. ‘నా కొడుక్కి మీ ఆస్తిలో సగం వాటా ఇవ్వాల్సిందే.. లేదంటే నేను ఏం చేసుకుంటానో మీరు ఊహించలేరు' అంటూ అరుస్తూ.. కేకలు పెడుతూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరూ ధాన్యాన్ని ఆపే ప్రయత్నం చేస్తుంటారు. ఆ షాక్‌లో చూసి సీతారామయ్య కింద పడిపోతాడు. అప్పుడు, వెంటనే అందరూ బిత్తరపోయి అలాగే చూస్తారు.
‘బావా’ ఏమైంది, ఏమైదంటూ ఇందిరా దేవి, తాతయ్యా అంటూ కావ్య.. మావయ్యగారు అంటూ అపర్ణా దేవి.. ఇలా అందరూ.. ఇంట్లో వాళ్ళు ఆయనను పిలుస్తూనే ఉంటారు. అయినాకూడా లేగకపోవడంతో సీతారామయ్యను హాస్పిటల్ కి తీసుకువెళ్తారు. ఇక ఇందిరా దేవి, ఆసుపత్రికి వెళ్లాక.. సీతారామయ్యకు ట్రీట్‌మెంట్ జరుగుతుంటే.. బయట అందరిముందు ధాన్యాన్ని గట్టి గట్టిగా తిడుతుంది. " ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా .. నీ మనసు మంచిగా ఉందా .. ఇప్పుడు అహంభావం తగ్గిందా?’ అంటూ అరుస్తూ ఉంటుంది. ఇంతలో రుద్రాణీ.. ‘అయినా ఆమె చేసిన తప్పేంటి? తాను అడిగిన ఆస్తి పంచేస్తే అయిపోయింది కదా’ అంటూ వెనకేసుకొస్తుంది. వెంటనే రుద్రాణీని అపర్ణా దేవి.. ‘హేయ్ ఆపు.. నువ్వు ఆపకపోతే నేను నిన్ను చంపేస్తాను’ అంటూ నోరుమూయిస్తుంది. ఇక్కడితో ఈ సీన్ ముగుస్తుంది.