- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
చంపేస్తామంటూ వరుస బెదిరింపులు.. బిక్కు బిక్కుమంటూ స్టార్ సెలబ్రెటీలు

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో బాలీవుడ్ స్టార్ సెలబ్రెటీలకు వరుస బెదిరింపులు ఎక్కువయ్యాయి. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్ ఖాన్‌కు వచ్చిన బెదిరింపులు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అనంతరం కోట్లాది రూపాయలు ఇవ్వాలని లేదంటే చంపేస్తామంటూ బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్‌ని గుర్తుతెలియని దుండగులు బెదిరించారు. దీనిపై ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇక తాజాగా సైఫ్ అలీఖాన్ పై జరిగిన దాడి సినీ ఇండస్ట్రీలోనే సంచలనంగా మారింది. ఈ దాడి ఘటన మరవక ముందే మరికొంతమంది సెలబ్రెటీలకు చంపేస్తామంటూ బెదిరింపులు రావటం మొత్తం బాలీవుడ్‌నే తీవ్ర భయాందోళనకు గురించేస్తోంది.
బాలీవుడ్ స్టార్ కమెడియన్ కపిల్ శర్మతో పాటు రాజ్‌పాల్ యాదవ్, రెమో డిసౌజాకు హత్య బెదిరింపులు వచ్చాయి. విష్ణు అనే వ్యక్తి నుంచి వీరికి బెదిరింపు మెయిల్ వచ్చినట్లు తెలుస్తోంది. తమ బెందిరిపులను సీరియస్‌గా తీసుకోవాలని, పబ్లిసిటీ స్టంట్ కోసమో, వేధించటం కోసమో చేయట్లేదని మెయిల్‌లో రాసున్నట్లు సమాచారం. ఎనిమిది గంటల్లో తన డిమాండ్లు నెరవేర్చాలని లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిందితుడు బెదిరించినట్లు తెలుస్తోంది. అయితే, మెయిల్ పంపిన వ్యక్తి ఇప్పటి వరకు తన డిమాండ్లను వెల్లడించలేదు. ఈ బెదిరింపులపై రాజ్‌పాల్ యాదవ్ భార్య చేసిన ఫిర్యాదు మేరకు అంబోలి పోలీసులు కేసు నమోదు చేసి, మెయిల్ ఐపీ అడ్రెస్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
బెదిరింపులు కొత్తేమీ కాదు..
ఇక బాలీవుడ్ సెలబెట్రీలకు ఈ విధమైన బెదిరింపులు రావటం కొత్తేమీ కాదు. గతంలో అజయ్‌దేవగన్, హీరోయిన్ ప్రీతిజింటా, సంజయ్ లీలా భన్సాలీ ఇలా ఎంతో మంది సెలబ్రెటీలకు ఈ విధమైన బెదిరింపులు వచ్చాయి. నాలుగు దశాబ్దాల క్రితం గ్యాంగ్‌స్టర్లు బాలీవుడ్‌ని శాసించే పరిస్థితి ఉండేది. దావూద్ ముఠా బెదిరింపులతో వణికిపోవాల్సి వచ్చేది. టీ సిరీస్ అధినేత గుల్షన్ కుమార్‌ను 1997లో 10కోట్లు డిమాండ్ చేసిన గ్యాంగ్‌స్టర్లు.. ఓ ఆలయం బయట ఆయన్ని కాల్చిచంపటం అప్పట్లో బాలీవుడ్‌ని షాక్‌కి గురిచేసింది. అండర్‌వరల్డ్ బెదిరింపులతో 80, 90 దశకాల్లో బాలీవుడ్ బిక్కుబిక్కుమంటూ బతకాల్సి వచ్చింది. 2000 నుంచి 2010 దాకా ముంబై కాస్త ప్రశాంతంగానే ఉంది. మళ్లీ పరిస్థితి మొదటకి వచ్చింది. బాలీవుడ్‌కే కాదు ముంబైలో పారిశ్రామికవేత్తలకు కూడా బెదిరింపులు వస్తున్నాయి.