Bhagyashree Borse: ప్రభాస్, ప్రశాంత్ వర్మ సినిమాలో హీరోయిన్ ఫిక్స్.. బంపర్ ఆఫర్స్ అందుకున్న రవితేజ హీరోయిన్!

by sudharani |
Bhagyashree Borse: ప్రభాస్, ప్రశాంత్ వర్మ సినిమాలో హీరోయిన్ ఫిక్స్.. బంపర్ ఆఫర్స్ అందుకున్న రవితేజ హీరోయిన్!
X

దిశ, సినిమా: రవితేజ (Ravi Teja) ‘మిస్టర్ బచ్చన్’ (Mr Bachchan) సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే (Bhagyashree Borse). ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచినప్పటికీ.. అందం, యాక్టింగ్ పరంగా ఈ బ్యూటీకి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. దీంతో ఈ భామకు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇందులో భాగంగా టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో అయినటువంటి రామ్ పోతినేని (Ram Pothineni) సరసన ‘రాపో-22’ మూవీలో నటిస్తోంది. అలాగే స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌‌ (Dulquer Salmaan)తో ‘కాంత’ సినిమాలో కూడా భాగ్యశ్రీ నటిస్తోంది. అంతే కాకుండా తమిళ స్టార్ హీరో సూర్య సినిమాలో కూడా ఈ అమ్మడుకు ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది.

ఇలా ప్రజెంట్ వరుస పాన్ ఇండియా స్టార్స్ సినిమాలో ఆఫర్లు అందుకున్న భాగ్యశ్రీ తాజాగా మరో బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రజెంట్ వరుస ప్రాజెక్టులు అనౌన్స్ చేస్తూ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇస్తున్నాడు. ఇందులో భాగంగా.. ప్రభాస్ (Prabhas) స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prashant Verma) కాంబోలో ‘బ్రహ్మ రాక్షస’ చిత్రం రాబోతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ (Official Announcement) రానప్పటికీ ఇప్పటికే లుక్ టెస్ట్ కూడా పూర్తయినట్లు సమాచారం. ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సేను ఫిక్స్ చేశారట మేకర్స్. అంతే కాకుండా భాగ్య శ్రీ బోర్సే మీద ఇటీవల లుక్ టెస్ట్ చేశారట. మ్యాగ్జిమమ్ ఆ అమ్మాయి ఫైనల్ కావచ్చని టాలీవుడ్ (Tollywood) వర్గాల నుంచి సమాచారం. అయితే.. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

Next Story

Most Viewed