8 Vasanthalu: బెస్ట్ మెలోడీగా ‘అందమా అందమా’.. ఆకట్టుకుంటోన్న ‘8 వసంతాలు’ ఫస్ట్ సింగిల్

by sudharani |
8 Vasanthalu: బెస్ట్ మెలోడీగా ‘అందమా అందమా’.. ఆకట్టుకుంటోన్న ‘8 వసంతాలు’ ఫస్ట్ సింగిల్
X

దిశ, సినిమా: ‘మ్యాడ్’ (Mad) ఫేమ్ హీరోయిన్ అనంతిక సనీల్‌కుమార్ (Anantika Sunilkumar) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘8 వసంతాలు’ (8 Vasanthalu). రవితేజ దుగ్గిరాల, హను రెడ్డి, సంజన, కన్నా పసునూరి, స్వరాజ్ రెబ్బా ప్రగడ, సమీరా కిశోర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఫణీంద్ర (Fanindra) దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. అనంతిక ఇందులో శుద్ధి అయోధ్య పాత్రలో నటిస్తుంది. అమ్మాయిలు వంటింటికి పరిమితం కాదు అని చెప్పే కాన్సెప్ట్‌తో పాటు బ్యూటిఫుల్ బ్రేకప్‌ స్టోరీతో ‘8 వసంతాలు’ రాబోతుంది. ఇప్పటికే ఇందులో నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, గ్లింప్స్ అందరిలో సినిమాపై పాజిటివ్ ఎక్స్‌పెక్టేషన్స్‌ను క్రియేట్ చెయ్యగా.. తాజాగా మరో బ్యూటీఫుల్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీ నుంచి ‘అందమా అందమా’ అంటూ సాగే ఫస్ట్ సింగిల్‌ (First single)కు ప్రోమోను రీసెంట్‌గా రిలీజ్ చెయ్యగా.. ఇప్పుడు పూర్తి పాటను విడుదల చేశారు. ప్రజెంట్ ఈ సాంగ్ బెస్ట్ మెలోడీ (Best Melody) పాటగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

Advertisement
Next Story

Most Viewed