- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘మిరాయ్’ నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌తో పాటు బ్యాడ్ న్యూస్.. ఆందోళనలో ఫ్యాన్స్(పోస్ట్)

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా(Teja Sajja) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి.. నేడు సినిమాల్లో హీరోగా నటించే స్థాయికి ఎదిగాడు. అలా ‘జాంబీ రెడ్డి’(Jambi Reddy) సినిమాతో మంచి విజయం సాధించాడు. ఆ తర్వాత ‘హో బేబీ’(Oh Baby) సినిమాలో కూడా నటించి మెప్పించాడు. అలాగే అద్భుతం(Adbhutham), ‘ఇష్క్’(Ishq) చిత్రాలతో ఓకే ఓకే అనిపించుకున్న అతను.. రీసెంట్‌గా ‘హనుమాన్’(Hanuman) మూవీతో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.
స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ(Prashanth Varma) తెరకెక్కించిన ఈ మూవీలో అమృత అయ్యర్(Amritha Ayyar) హీరోయిన్‌గా నటించగా.. వరలక్ష్మి శరత్ కుమార్(Varalakshmi Sarathkumar) తేజా సజ్జాకు అక్కగా నటించింది. దీంతో ఈ యంగ్ హీరోకు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. అలా ప్రస్తుతం తేజ ‘మిరాయ్’(Mirai) అనే మూవీలో నటిస్తున్నాడు. కార్తీక్ ఘట్టమనేని(Karthik Ghattamaneni) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ(People Media Factory) పతాకంపై టీజీ విశ్వప్రసాద్(TG Vishwa Prasad) భారీ బడ్జేట్‌తో నిర్మిస్తున్నారు.
ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన గ్లింప్స్, టీజర్, పోస్టర్స్ ప్రేక్షకుల్లో మరింత అంచనాలను పెంచాయి. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న పోస్ట్ ప్రకారం.. ‘తేజ సజ్జ నటిస్తున్న మిరాయి చిత్రం ఇటీవల నీటి అడుగున జరిగే సన్నివేశాన్ని పూర్తి చేసింది. అలాగే ఈ ఇంకా ఈ సినిమాకు సంబంధించి 30 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఏప్రిల్ 18వ తేదీ నుంచి సినిమాను వాయిదా వేసి, జూలై 4వ తేదీన రిలీజ్ చేయాల చిత్ర బృందం పరిశీలిస్తోంది’ అని ఉంది. దీంతో ఫ్యాన్స్ అప్సెట్ అవుతూ చెప్పిన డేట్‌కే రిలీజ్ చేసేలా చూడండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ చిత్రంలో రితికా నాయక్(Rithika Nayak) హీరోయిన్‌గా నటిస్తుంది.