Anupama 'Dragon' : ‘డ్రాగన్’ ట్రైలర్ వచ్చేసింది.. హీరోహీరోయిన్ లవ్ ట్రాక్‌కు ఫిదా అవుతున్న నెటిజన్లు

by sudharani |
Anupama Dragon : ‘డ్రాగన్’ ట్రైలర్ వచ్చేసింది.. హీరోహీరోయిన్ లవ్ ట్రాక్‌కు ఫిదా అవుతున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: తమిళ్ నటుడు ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) హీరోగా, యంగ్ బ్యూటీస్ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran), కయాదు లోహర్ (Kayadu Lohar) హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘డ్రాగన్’. ఈ మూవీకి ‘ఓ మై కడవులే’ ఫేమ్ అశ్వత్ మరి ముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కల్పాతి ఎస్. అఘోరమ్, కల్పాతి ఎస్. గణేష్, కల్పాతి ఎస్. సురేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్ ఆకట్టుకోగా.. తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు చిత్ర బృందం.

2 నిమిషాలకి పైగా ఉన్న ఈ ట్రైలర్ కాలేజీ నేపథ్యం, హీరోహీరోయిన్ లవ్, ఎమోషన్స్ ఇంటెన్స్ సీన్స్‌తో ఎంతో అట్రాక్టింగ్‌గా సాగింది. అయితే.. కొన్ని సార్లు కాలేజీ స్టూడెంట్స్ అటెన్షన్, పాపులారిటీకి ఎలా బానిసలవుతారనే దాని చుట్టూ ‘డ్రాగన్’ కథ ఉంటుందని డైరెక్టర్ ఇప్పటికే హింట్ ఇవ్వగా.. ఈ ట్రైలర్ చూస్తే అది నిజమే అనిపించగా ఈ సినిమా కుర్రకారును విపరీతంగా ఆకట్టుకోనుందని అర్థమవుతోంది. కాగా ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా ఫిబ్రవరి 21న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాలో మిస్కిన్, కెఎస్ రవికుమార్, విజె సిద్ధూ, హర్షత్ ఖాన్, అవినాష్ పి వంటి ప్రముఖులు కీలక పాత్రలో నటిస్తున్నారు.


Next Story

Most Viewed