Anil Ravipudi: సినిమా షూటింగ్‌లో వెంకీమామతో బాలయ్యబాబు.. వైరల్ అవుతున్న డైరెక్టర్ పోస్ట్

by Kavitha |
Anil Ravipudi: సినిమా షూటింగ్‌లో వెంకీమామతో బాలయ్యబాబు.. వైరల్ అవుతున్న డైరెక్టర్ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎఫ్ 2(F2), ఎఫ్ 3(F3) త‌ర్వాత విక్ట‌రీ వెంక‌టేష్(Victory Venkatesh), స్టార్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబినేష‌న్ లో హ్యాట్రిక్ మూవీ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్(Sri Venkateshwara Creationas) బ్యాన‌ర్ పై ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు(Dil Raju) ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా.. ఐశ్వ‌ర్య రాజేష్(Aishwarya Rajesh), మీనాక్షి చౌద‌రి(Meenakshi Chowdary) హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ(Ramoji Film City)లో జరుగుతుంది. అయితే బాలకృష్ణ(Balakrishna), బాబీ(Bobby) కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా షూటింగ్ కూడా అక్కడే జరుగుతుండటంతో నేడు బాలకృష్ణ వెంకటేష్ సినిమా సెట్స్‌కి వెళ్లారు. అక్కడ బాలయ్య బాబు.. వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడితో కలిసి కాసేపు ముచ్చట్లు పెట్టాడు . బాలకృష్ణ సెట్‌లో ఉన్నవారందర్నీ పలకరించాడు. వెంకీమామతో కలిసి స్పెషల్‌గా ఫోటో కూడా దిగారు.

ఇక వాటిని అనిల్ రావిపూడి ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ.. “మా వెంకీఅనిల్3 సెట్స్‌కి నటసింహం నందమూరి బాలకృష్ణ గారు ఒక తీపి & ఆకస్మిక విజిట్” అంటూ క్యాప్షన్ జోడించారు. అలాగే ఓ ఫన్నీ వీడియోను కూడా షేర్ చేశారు. దీంతో ఈ పోస్ట్ కాస్త వైరల్‌గా మారింది. ఇక అది చూసిన నెటిజన్లు.. ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలను ఒకే ఫ్రేమ్‌లో చూసి చాలా హ్యాపీగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

(video link credits to anil ravipudi instgram id)

Next Story

Most Viewed