‘మీ వేగం కంటే మీ దిశ చాలా ముఖ్యం’.. అంటూ చీరకట్టులో మైమరిపిస్తోన్న హాట్ యాంకర్

by Anjali |
‘మీ వేగం కంటే మీ దిశ చాలా ముఖ్యం’.. అంటూ చీరకట్టులో మైమరిపిస్తోన్న హాట్ యాంకర్
X

దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెర యాంకర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన హాట్ యాంకర్ అనసూయ (Anchor Anasuya) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ భామకు కుర్రాళ్ల నుంచి ముసలివారికి సైతం ఫేవరెట్ అని చెప్పుకోవచ్చు. బుల్లితెరపై యాంకర్‌గా సత్తా చాటి.. ప్రస్తుతం వెండితెరపై తన ప్రతిభ చూపిస్తోంది. వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. ఏకంగా ప్రముఖ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ తెలుగు ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. తన అద్భుతమైన నటనతో నెటిజన్లను తనవైపు తిప్పుకుంటుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Global star Ram Charan) నటించిన రంగస్థలం (Raṅgasthalaṁ) సినిమాలో ముఖ్యపాత్ర పోషించిన విషయం తెలిసిందే. తర్వాత విమానంలో నటించింది.

టాలీవుడ్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun)నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం పుష్ప (Pushpa) రెండు భాగాల్లో నటించి.. జనాల్లో అండ్ సినీ ఇండస్ట్రీలో మరింత క్రేజ్ దక్కించుకుంది. దాక్షాయణిగా టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ సునీల్ కు భార్యగా నటించింది. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) సినిమా సింబాలో కూడా కనిపించిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈ హాట్ యాంకర్ తాజాగా సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోలు పంచుకుంది. ‘మీ వేగం కంటే మీ దిశ చాలా ముఖ్యం’.. అంటూ క్యాప్షన్ జోడించి.. చీరకట్టులో ఉన్న పిక్స్ షేర్ చేసింది. ఈ ఫొటోలతో పాటుగా ఆకట్టుకుంటోన్న ఓ వీడియో కూడా పంచుకుంది.

Advertisement
Next Story

Most Viewed