Taman: కన్నీళ్లతో ఈ మెసేజ్ టైప్ చేస్తున్న.. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఎమోషనల్ ట్వీట్

by sudharani |
Taman: కన్నీళ్లతో ఈ మెసేజ్ టైప్ చేస్తున్న.. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఎమోషనల్ ట్వీట్
X

దిశ, సినిమా: మ్యూజిక్ డైరెక్టర్ తమన్ (Taman) దాదాపు టాలీవుడ్‌లో స్టార్ హీరోల సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్‌(Music Director)గా వ్యవహరించి ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నాడు. అంతే కాకుండా.. రీసెంట్‌గా బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ (Daku Maharaj)తో ఆ క్రేజ్ మరింత పెంచుకుని స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా రాణిస్తున్నాడు. అలాగే.. ప్రజెంట్ పలు భారీ ప్రాజెక్టులకు మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తూ ఆ చిత్రాలకు సంబంధించిన అప్‌డేట్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కు అందుబాటులో ఉంటున్నాడు. ఇలా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే తమన్ తాజాగా ఓ ఎమోషనల్ ట్వీట్ (emotional tweet) షేర్ చేశాడు.

ఈ మేరకు దివంగత నటుడు కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌ (Puneeth Rajkumar)ను గుర్తుచేసుకుంటా ‘నువ్వు మమ్మల్ని ఎలా వదిలేస్తావు అన్నా.. మేము నిన్ను కోల్పోయాము మా ప్రియమైన పునీత్ రాజ్‌కుమార్ అన్నా. వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ హ్యూమన్ ఫ్రెండ్ బ్రదర్ నేను నిన్న ఎంతగానో ప్రేమిస్తున్నాను.. నిన్ను కోల్పోవడాన్ని ఇప్పటికి జీర్ణించుకోలే పోతున్నాను. ఈ మెసేజ్ టైప్ చేస్తుంటే నా కళ్లు నీళ్లతో నిండిపోయాయి. దేవుడు కొన్నిసార్లు కఠినంగా ఉంటాడు.. లవ్ యు అప్పు అన్న.. మీరు సమాజానికి, ప్రజలకు చేసిన మేలు మాటల్లో చెప్పలేము. మీరు ఎప్పటికీ మా హృదయాల్లో బతికే ఉంటారు’ అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు తమన్.

కన్నడ పవర్ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్.. తనకు ఆరు నెలలు వయసు ఉన్నప్పుడే బాలనటుడిగా కెరీర్ స్టార్ట్ చేశారు. అంతే కాకుండా బాల నటుడిగా 13 సినిమాలు చేసి ఉత్తమ బాలనటుడిగా జాతీయ అవార్డును సైతం అందుకున్నారు. ఇక 2022లో ‘అప్పూ’ సినిమాతో హీరోగా పరిచయమైన ఆయన 45 ఏళ్ల సినీ జీవితంలో 32 సినిమాల్లో నటించారు. దీంతో పాటు.. సహాయం కోరిన వారికి లేదు అనకుండా వారికి అండగా నిలబడి సమాజంలో రియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక 46 సంవత్సరాల వయసులోనే ఆయన మృతి చెందడం చిత్ర పరిశ్రమను కుదిపేసింది.

Next Story

Most Viewed