- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Alia Bhatt: కేన్స్ వైపు స్టార్ హీరోయిన్ అడుగులు.. కొంచెం భయంగా ఉందంటూ కామెంట్స్

దిశ, సినిమా: ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అనతికాలంలోనే బాలీవుడ్(Bollywood)లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది అలియా భట్ (Alia Bhatt). తన అందం, నటనతో ఎంతో ఫ్యాన్స్‌ను సొంతం చేసుకున్న ఈ బ్యూటీ.. రాజమౌళి (Rajamouli) ఆర్ఆర్ఆర్ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఆకట్టుకుంది. చివరగా గతేడాది వేదాంగ్ రైనా ప్రధాన పాత్రల్లో వాసన్ బాలా దర్శకత్వంలో తెరకెక్కిన ‘జిగ్రా’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దసరా స్పెషల్‌గా అక్టోబర్ 11న రిలీజైన ఈ మూవీకి భారీ ఎత్తున ప్రమోషన్స్ చేసినప్పటికీ అనుకున్నంత విజయం మాత్రం దక్కలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘ఆల్ఫా’ సినిమాతో బిజీగా ఉంది. ఇక సినిమాల విషయాలు పక్కన పెడితే.. గత ఏడాది ‘మెట్‌గాలా’లో సందడి చేసిన అలియా ఇప్పుడు మరో ఇంటర్నేషనల్ ఈవెంట్ కేన్స్ చిత్రోత్సవాల్లో (Cannes Film Festival) సందడి చేసేందుకు సిద్ధం అవుతోంది.
ప్రస్తుతం తన బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో బిజీగా ఉన్నా ఈ బ్యూటీ.. తాజాగా మీడియాతో ముచ్చటించి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది. ‘సినిమా ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే గొప్ప పండుగ కేన్స్. ఈ వేడుకలు కోసం నేను ఎంతోగానో ఎదురుచూస్తున్నారు. మే 13నుంచి మే 24, 2025 వరకు జరగబోయే 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్(78th Cannes Film Festival)కు ఇండియన్ స్టార్స్ (Indian Stars) ఎప్పటి నుంచో వస్తున్నారు. వారిలో ఐశ్వర్య రాయ్ బచ్చన్ (Aishwarya Rai Bachchan), దీపికా పదుకొణె (Deepika Padukone), సోనమ్ కపూర్ (Sonam Kapoor) లాంటి వాళ్లు రెగ్యులర్‌గా వస్తుంటారు. ఈ ఏడాది నేను ఇందులో భాగం కావడం కొంచెం భయంగానే ఉంది. అలాగే, కేన్స్‌లో తొలి అడుగు పెట్టబోతున్నందుకు చాలా ఉత్సాహంగా కూడా ఉన్నాను’ అంటూ చెప్పుకొచ్చింది.