Alia Bhatt: ఇన్ స్టా లో అలియా భట్ మరో క్రేజీ రికార్డు

by Prasad Jukanti |   ( Updated:2025-02-17 06:34:21.0  )
Alia Bhatt: ఇన్ స్టా లో అలియా భట్ మరో క్రేజీ రికార్డు
X

దిశ, డైనమిక్ బ్యూరో: టెక్నాలజీ రాకతో ప్రజల మధ్య సమాచార సరిహద్దులు చెరిగిపోయాయి. తామ దైనందిన జీవితంలోని అప్ డేట్స్ ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా ఇతరులకు చేరవేస్తున్నారు. ఈ విషయంలో సెలబ్రేటీలు తమ అభిమానులను హ్యాపీ చేసేందుకు తమ మూవీస్ తో పాటు డే టుడే లైఫ్ కు సంబంధించిన అప్ డేట్స్ ను ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ వంటి ఫ్లాట్ లో అప్ లోడ్ చేస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది తమ అభిమాన నటీనటులు, రాజకీయ నాయకులు, సామాజికవేత్తలను వారివారి అభిమానులు ఫాలో అవుతున్నారు. ఈ ఫాలోయింగ్ లోనూ పలువురు రికార్డులు బ్రేక్ చేస్తున్నారు. తాజాగా బాలీవుట్ హీరోయిన్ అలియా భట్ (Alia Bhatt) ప్రపంచవ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram) లో ప్రపంచంలోని 2వ అత్యంత ప్రభావవంతమైన నటిగా (most influential actor) గుర్తింపు పొందారు. ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ప్లాట్‌ఫారమ్ హైప్ ఆడిటర్ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం డ్వేన్ జాన్సన్, జెన్నిఫర్ లోపెజ్ వంటి గ్లోబల్ ఐకాన్‌లను అలియా భట్ మించిపోయింది. ఈ అద్భుతమైన విజయం వినోద పరిశ్రమలో ఆధిపత్య శక్తిగా ఆమె స్థితిని నొక్కి చెబుతుంది. 85 మిలియన్లకు పైగా ఫాలోవర్లతో ఆమె క్రేజీగా సోషల్ మీడియాలో మరింత క్రేజీగా మారారు. ఫ్యాషన్, దాతృత్వంతో సహా వివిధ డొమైన్‌లలో ఆమెను ట్రెండ్‌సెట్టర్‌గా చేసింది.

Next Story