Akshay Kumar : భారత చరిత్ర గురించి అక్షయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు

by M.Rajitha |
Akshay Kumar : భారత చరిత్ర గురించి అక్షయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్ : బాలీవుడ్(Bollywood) నటుడు అక్షయ్ కుమార్(Akshay Kumar) భారత చరిత్ర గురించి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్షయ్ తాజా సినిమా 'స్కైఫోర్స్'(SkyForce) ప్రమోషన్ లో భాగంగా మాట్లాడుతూ.. దేశం కోసం త్యాగం చేసిన ఆర్మీ సైనికుల గురించి పాఠ్య పుస్తకాల్లో చదువుకోవాలని సూచిస్తూ.. అక్బర్(Akbar), ఔరంగజేబు(Aurangajeb) గురించి చదువుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. చరిత్ర పుస్తకాల్లో(History Books) దేశం కోసం అమరులైన జవాన్ల కథలు, పరమవీరచక్ర అవార్డులు పొందిన వారి గురించి కథలు ప్రచురించాలని.. ఇప్పటికీ మొఘల్ చరిత్ర చదువుకోవడం అవసరమా అని అన్నారు. కాగా అక్షయ్ చేసిన ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతున్నాయి. అక్షయ్ చరిత్ర గురించి అసలేమి తెలియకుండా అజ్ఞానంతో మాట్లాడుతున్నాడంటూ రాజకీయ నాయకులు, నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story

Most Viewed