- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అస్సలు ఊహించలేదు.. మీ వల్లే నా కల నెరవేరిందంటూ ధనుష్‌పై యంగ్ హీరోయిన్ పోస్ట్

దిశ, సినిమా: అనిఖా సురేంద్రన్(Anikha Surendran) చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయిన సంగతి తెలిసిందే. ‘విశ్వాసం’(Viswasam) సినిమాలో అజిత్ కుమార్(Ajith Kumar) కూతురిగా నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత హీరోయిన్‌గా మారి తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో నటించి తన నటనతో క్రేజీ బ్యూటీగా మారిపోయింది. అతిచిన్న వయసులోనే సినిమా ఇండస్ట్రీకి వచ్చి అనతి కాలంలోనే ఫుల్ పాపులారిటీ దక్కించుకుందనడంలో అతిశయోక్తి లేదు. తెలుగులో అనిఖా బుట్టబొమ్మ, ది గోస్ట్ సినిమాలల్లో నటించి మెప్పించింది. ఇక గత ఏడాది కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush)‘రాయన్’ లోనూ నటించింది.
అయితే ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇక అనిఖా నటనకు ఫిదా అయిన ధనుష్ మరో మూవీలో చాన్స్ ఇచ్చారు. ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’(Jaabilamma Neeku Antha Kopama) సినిమాలో హీరోయిన్‌గా తీసుకున్నారు. ధనుష్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని వండర్‌బార్ ఫిల్మ్స్, ఆర్‌కె ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై ఆయనే స్వయంగా నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్(G.V. Prakash Kumar) సంగీతం అందించగా.. ఇందులో పవిష్, అనిఖా, ప్రియాంక అరుళ్ మోహన్(Priyanka Arul Mohan), మాథ్యూ థామస్, వెంకటేష్ మేనన్, ఖాటూన్, రమ్య రంగనాథ్, ప్రియా ప్రకాష్ వారియర్ కీలక పాత్రలో కనిపించారు. అయితే ఈ సినిమా ఫిబ్రవరి 21న థియేటర్స్‌లోకి వచ్చి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుని బాక్సాఫీసు వద్ద రాణిస్తోంది.
ఈ నేపథ్యంలో.. తాజాగా, అనిఖా, ధనుష్‌పై ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. ‘‘జాబిలమ్మ నీకు అంత కోపమా చివరకు ముగిసింది. ధనుష్ సార్‌కి ఎప్పటికీ కృతజ్ఞతలు. మీరు నా కలలను నిజం చేశారు. నేను వెళ్లి ఒక చిత్రాన్ని అడిగాను. అప్పుడు ఈ అవకాశాన్ని ఇచ్చారు. అతని దర్శకత్వంలో నటించడం అనేది నేను కలలో కూడా ఊహించని విషయం. Tbh ఇప్పటికీ పూర్తిగా ప్రాసెస్ చేయబడలేదు. ధనుష్ సార్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’’ అని రాసుకొచ్చింది. అలాగే ఆయనతో తీసుకున్న ఫొటోను షేర్ చేసింది. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు కొందరు ఫైర్ ఎమోజీలు షేర్ చేస్తుండగా.. మరికొందరు హార్ట్ సింబల్స్ పెడుతున్నారు.