- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ మ్యూజియంలో చోటు దక్కించుకున్న మాజీ విశ్వసుందరి లెహంగా.. చరిత్రలో నిలిచిపోనుందా?
దిశ, వెబ్‌డెస్క్: మాజీ విశ్వసుందరి ఐశ్వర్య రాయ్(Aishwarya Rai) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు. విశ్వసుందరిగా ప్రేక్షకుల్లో పేరు దక్కించుకుంది. ఈ బ్యూటీ తన అందం, నటన, డ్యాన్స్‌తో కోట్లాది మంది అభిమానుల్ని దక్కించుకుంది. ఐశ్వర్య చివరగా పొన్నియిన్ సెల్వన్ -2 (Ponniin Selvan) చిత్రంలో నటించింది. ఈ హీరోయిన్ అద్భుతమైన నటనకు ఉత్తమ నటిగా సైమా అవార్డు(Saima Award)ను దక్కించుకుంది. ఈ సినిమాకు మణిరత్నం(Mani Ratnam) దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఇదంతా పక్కన పెడితే..
2008 లో జోధా అక్బర్(Jodha Akbar) చిత్రంలో ఐశ్వర్య కీలక పాత్రలో నటించి.. ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఇందులో హృతిక్ రోషన్(Hrithik Roshan) కథానాయకుడిగా కనిపించారు. ఈ మూవీలో నటి ఐశ్వర్య రాయ్ ఆకట్టుకునే లెహంగా ధరించింది. ఇప్పుడు ఈ లెహంగా ఆస్కార్ మ్యూజియం(Oscar Museum)లో స్థానం సంపాదించుకోవడం విశేషం. ఈ విషయాన్ని అకాడమీ(Academy) అఫిషీయల్‌గా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
‘జోధా అక్బర్ చిత్రంలో రాణి ధరించిన లెహంగా వెండితెర ప్రేక్షకుల్ని ఎంతోమందిని ఆకట్టుకుంది. సినిమాలో రాణి అందానికి కూడా కారణమైంది. ఇప్పుడు ఈ లెహంగాను ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ మ్యూజియంలో ప్రదర్శిస్తున్నాం. ఇది చరిత్రలో నిలిచిపోతుంది’. అని అకాడమీ రాసుకొచ్చింది. మొదటి సారి అకాడమీ మ్యూజియంలో కనిపించనున్న మొదటి ఇండియన్ డ్రెస్ ఇదే. కాగా ఈ లెహంగాను తయారు చేసిన నీతా లుల్లా(Neeta Lulla)ను జనాలు కొనియాడుతున్నారు. ఈ సందర్భంగా ఐశ్వర్య అభిమానులు హర్హం వ్యక్తం చేస్తున్నారు. తమదైన శైలిలో స్పందిస్తూ.. నెట్టింట కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.