- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
హాట్ మిర్చిలా హీట్ ఎక్కిస్తున్న ఐశ్వర్య.. రియల్ లైఫ్‌కి అర్థం చెబుతూ ఆసక్తికర పోస్ట్

దిశ, సినిమా: హీరోయిన్ ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘రాంబంటు’(Rambantu) చిత్రంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ‘కౌసల్య కృష్ణమూర్తి’(Kousalya Krishnamoorthi) సినిమాతో మంచి ఫేమ్ తెచ్చుకుంది. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ అనుకున్నంతగా గుర్తింపు రాలేదు. అయితే రీసెంట్‌గా అనిల్ రావిపూడి(Anil Ravipudi) డైరెక్షన్‌లో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunnam) సినిమాతో మాత్రం ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. ఇక వెంకటేష్(Venkatesh) హీరోగా నటించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి(Meenakshi Chowdary) కూడా నటించింది.
ఇక దీనిని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్(SVC) బ్యానర్ పై దిల్ రాజు(Dil Raju) నిర్మించారు. అయితే ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ అయి.. బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటు కలెక్షన్ల పరంగా ట్రెండ్ సెట్ చేస్తుంది. ఇక ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ నలుగురు పిల్లల తల్లిగా, వెంకటేష్ భార్య నటించిందన్న సంగతి తెలిసిందే. ఆమె నటనకు తెలుగు ఆడియన్స్ ఫుల్ ఫిదా అయ్యారు. ప్రస్తుతం సంక్రాంతికి వస్తున్నాం మూవీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తుంది ఈ బ్యూటీ..
అలాగే నిత్యం సోషల్ మీడియా(Social Media)లోనూ యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా ఐశ్వర్య తన ఇన్‌స్టా(Instagram) వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో రెడ్ కలర్ లెహంగా వేసుకుని హెయిర్ లీవ్ చేసుకుని హాట్ మిర్చిలా ఫొటోస్‌కి స్టిల్ ఇచ్చింది. అంతే కాకుండా వీటికి.. ‘లైఫ్ బ్యాలెన్స్ అనేది పట్టుకోవడం అండ్ వదిలేయడం పై ఆధారపడి ఉంటుంది’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారగా.. రెడ్ డ్రెస్‌లో హీట్ పెంచుతున్నావు ఐశ్వర్య అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.