మళ్లీ రెచ్చిపోయిన నటి శ్రీరెడ్డి.. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు.. ఏకిపారేస్తున్న మెగా ఫ్యాన్స్(ట్వీట్)

by Kavitha |
మళ్లీ రెచ్చిపోయిన నటి శ్రీరెడ్డి.. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు.. ఏకిపారేస్తున్న మెగా ఫ్యాన్స్(ట్వీట్)
X

దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియా సన్సేషన్.. హాట్ బ్యూటీ శ్రీరెడ్డి (Sri Reddy) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె హీరోయిన్ కాకపోయినా అడపాదడపా చిన్న చిన్న సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మెప్పించి, హీరోయిన్ రేంజ్‌లో పాపులారిటీ సొంతం చేసుకుంది. హాట్ అందాలతో యువతకు పిచ్చెక్కించే ఈమె తన మాటలతో అందరికీ చిరాకు తెప్పిస్తుంటుంది. ఈమె తరచూ ప్రముఖ సెలబ్రిటీలు, రాజకీయ నేతలపై వివాదాస్పద కామెంట్స్ చేస్తూ నెట్టింట హాట్‌టాపిక్‌గా నిలుస్తూ ఉంటోంది. ముఖ్యంగా ఈ భామ.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) వంటి వారిపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉంటుంది. అయితే ఈమె మాజీ ముఖ్యమంత్రి జగన్‌ (Jagan) కు సపోర్ట్‌గా మాట్లాడుతుందనే విషయం అందరికీ తెలిసిందే.

ఇదిలా ఉంటే.. తిరుపతిలో స్వామివారి ప్రసాదమైన లడ్డూలో కల్తీ ఉందని తేలడంతో ఆంధ్రప్రదేశ్(Andhrapradesh) డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పశ్చాత్తాప దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. 11 రోజుల పాటు సాగే ఈ దీక్షను పవన్ కళ్యాణ్ చేపట్టారు. హిందూ ధర్మాన్ని కాపాడడమే ధ్యేయమని, సనాతన ధర్మం పాటించడం మనందరి బాధ్యత అంటూ పవన్ కళ్యాణ్ కామెంట్లు చేశారు. ఈ క్రమంలో నేడు శ్రీరెడ్డి మరోసారి రెచ్చిపోయింది. డిప్యూటీ సీఎం అని కూడా చూడకుండా పవన్ కళ్యాణ్‌ను పచ్చి బూతులు తిడుతూ ట్వీట్ చేసింది. అది చూసిన మెగా ఫ్యాన్స్ ఆమె పై మండి పడుతున్నారు. మరి మీరు కూడా ఆమె పెట్టిన ట్వీట్‌ను చూసేయండి.




Next Story

Most Viewed