Mahira Khan: పాకిస్థాన్ నటి మహిరా ఖాన్ ఎమోషనల్ కామెంట్స్..!

by Anjali |   ( Updated:2024-12-17 15:47:09.0  )
Mahira Khan: పాకిస్థాన్ నటి మహిరా ఖాన్ ఎమోషనల్ కామెంట్స్..!
X

దిశ, వెబ్‌డెస్క్: నటి మహిరా ఖాన్(Mahira Khan) తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరై.. ఎమోషనల్ కామెంట్స్ చేసింది. గతంలో బాలీవుడ్ ప్రముఖ నటుడు రణబీర్ కపూర్‌(Bollywood famous actor Ranbir Kapoor)తో కలిసి ఈ నటి సిగరెట్ పట్టుకుని దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో దుమారం రేపిన విషయం తెలిసిందే. తాజాగా మహిరా ఈ ఇష్యూ గురించి ఇంటర్వ్యూలో మాట్లాడింది. ది లిటిల్ వైట్ డ్రెస్ అంటూ ఓ మీడియా వార్త రాసిందని.. అస్సలు ఏం జరుగుతుందో అప్పుడు అంతగా కనిపెట్టలేకపోయానని తెలిపింది. పాకిస్థాన్‌(Pakistan)లో మంచి నటిగా గుర్తింపు దక్కించుకున్న ఈమెకు ఏమైందంటూ రాసిన లైన్ చూసి.. నాకేమైనా పిచ్చి లేసిందా? అని అనుకున్నానని వెల్లడించింది. ఇక అంతే నా కెరీర్ క్లోజ్ అయిపోయిందనే ఫీలింగ్ వచ్చిందని పేర్కొంది. నిజం చెప్పాలంటే నా లైఫ్‌లో కష్టతరమైన డేస్ అంటే అవేనని తెలిపింది. పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌పై ఎఫెక్ట్ పడిందని వెల్లడించింది. ఈ విషయంలో చాలా సార్లు ఏడ్చిన సందర్భాలున్నాయని..ఓ వైపు డివోర్స్ బాధలో ఉన్నానని తెలిపింది. సింగిల్ పేరెంట్‌గా ఉన్న సమయంలోనే ఈ ఫొటోలు లీక్ అయ్యాయని.. కానీ కష్టసమయంలో తన ఫ్యాన్స్ సపోర్ట్‌గా ఉన్నారని మహిరా ఖాన్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ నటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read More...

Bhagyashree Borse: లేటెస్ట్ ఫొటోస్‌తో హీట్ పుట్టిస్తున్న బ్యూటీ..


Advertisement

Next Story

Most Viewed