చేసేదంత చేసి క్షమాపణలు చెప్తే సరిపోతుందా... యంగ్ హీరోయిన్ ఫైర్.. వీడియో వైరల్

by sudharani |   ( Updated:2025-02-14 14:37:53.0  )
చేసేదంత చేసి క్షమాపణలు చెప్తే సరిపోతుందా... యంగ్ హీరోయిన్ ఫైర్.. వీడియో వైరల్
X

దిశ, సినిమా: తెలుగు హీరోయిన్ అనన్య నాగళ్ల (Ananya Nagalla) ప్రస్తుతం టాలీవుడ్‌లో పలు ఆఫర్లు అందుకుంటూ బిజీగా ఉంది. గతేడాది పొట్టేల్ (Pottel), శ్రీకాకుళం సెర్లాక్‌హోమ్ (Srikakulam Serlakhome)వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ బ్యూటీ యాక్టింగ్ పరంగా మంచి మార్కులే అందుకుంది. దీంతో.. వరుస అవకాశాలు అందుకుంటూ ప్రజెంట్ హీరోయిన్‌గా రాణిస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా అనన్య నాగళ్లకు ఓ చేదు అనుభవం ఎదురైనట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా అకౌంట్ X వేదికగా పంచుకుంది.

‘నేను ఈరోజు ఉదయం ఒక కార్యక్రమం కోసం హైదరాబాద్ (Hyderabad)నుండి మధురై(Madurai)కి వెళ్తున్నా. నేను నా రెండు బ్యాగేజీలను చెక్ ఇన్ చేశా. కానీ వాటిలో ఒకటి 6 గంటలు ఆలస్యమైంది. నేను కస్టమర్ కేర్‌(Customer Care)ను సంప్రదించినప్పుడు వారు క్షమించండి అని చెప్పారు. అలాగే వారు దానిని అందుబాటులో ఉన్న తదుపరి విమానంలో పంపుతారట. @IndiGo6E కి ఇది ఆమోదయోగ్యం కాదు. మీకు అండ్ కస్టమర్‌కు ఎందుకు వేర్వేరు నియమాలు ఉన్నాయి. కస్టమర్ నుండి ఒక నిమిషం ఆలస్యమైతే ఇతర ప్రయాణీకులు మీ కోసం వేచి ఉండలేరు కాబట్టి మేము అనుమతించలేమని మీరు చెబుతారు. ఇప్పుడు మీ 6 గంటల లగేజీ ఆలస్యం కారణంగా దాదాపు 2000 మంది విద్యార్థులు నా కోసం వేచి ఉన్నారు. క్షమించండి అని చెప్పడం కరెక్ట్ కాదు’ అని చెప్తూ నేను కూడా మెరుగైన వ్యవస్థ కోసం ఆశిస్తున్నాను అని తన అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకుంది అనన్య.

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed