ఏమాత్రం మారలేదు.. అందుకే వరంగల్ సెంట్రల్ జైలుకు

by Shyam |   ( Updated:2020-08-06 08:10:26.0  )
ఏమాత్రం మారలేదు.. అందుకే వరంగల్ సెంట్రల్ జైలుకు
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్ మహ్మద్ మోసిన్ ఖాన్ అలియాస్ మోసిన్‌పై పీడీ యాక్ట్ నమోదు చేసినట్టు వన్ టౌన్ సీఐ నిగిడాల సురేష్ తెలిపారు. మోసిన్‌పై ఒక హత్య కేసు, రెండు హత్యాయత్నం కేసులతో పాటు, పలువురిని బెదిరించి బలవంతపు వసూళ్లకు పాల్పడిన ఆరు కేసుల్లో నిందితుడుగా ఉన్నట్టు సీఐ సురేష్ వివరించారు.

సుమారు ఐదేండ్ల నుంచి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్‌గా ఉన్న మోసిన్‌పై 2018లో పీడీ యాక్ట్ నమోదు చేసి రిమాండుకు పంపించామని, ఏడాది కాలం పాటు శిక్ష అనుభవించాడని తెలిపారు. అనంతరం తిరిగి వచ్చిన తర్వాత తన స్వభావాన్ని ఏ మాత్రం మార్చుకోకుండా మళ్లీ ముగ్గురు వ్యక్తులను బెదిరించి బలవంతపు వసూళ్లకు పాల్పడ్డాడని తెలిపారు.

నేర స్వభావాన్ని ఏమాత్రం మార్చుకోకుండా సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న కారణంగా జిల్లా ఎస్పీ రంగనాథ్ ఆదేశాల మేరకు, డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో పీడీ యాక్ట్ నమోదు చేసి వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించామని తెలిపారు. ఇలాంటి వ్యక్తులపై కఠిన వైఖరి అవలంభిస్తూ సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వారిపై నిఘా ఉంచుతామని సీఐ నిగిడాల సురేష్ హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed