- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కరోనాపై సీఐ సాంగ్.. ‘శభాష్ పోలీసన్న’
హైదరాబాద్: ‘కరోనా’ ఈ పేరు వింటేనే ప్రపంచం వణికిపోతోంది. ఈ ప్రమాదకర వైరస్ ప్రస్తుతం మన దేశ ప్రజలనూ భయపెడుతోంది. దీంతో మహమ్మారిపై పలు అపోహలు, వదంతులు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో ఈ వైరస్ ప్రభావం దేశంలో, రాష్ట్రంలో లేదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వదంతులను నమ్మొద్దని ఒక వైపు డాక్టర్‌లు, పోలీసులు ఘంటా పథంగా చెబుతున్నారు. అయినా కొందరు పనిగట్టుకొని లేని పోని భయాలు సృష్టిస్తున్నారు. రాచకొండ కళాబృందానికి నాయకత్వం వహిస్తూ, ముఢనమ్మకాలతోపాటు, వదంతులపై సామాన్యులకు అవగాహన కల్పించి, ప్రజలను చైతన్యవంతులను చేయడానికి ఎల్‌బీనగర్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ అంజపల్లి నాగమల్లు ప్రయత్నిస్తున్నారు.
ఇప్పటి వరకు అనేక సామాజిక సమస్యలపై పాటలు రాసి, తన గళంతో అవగాహన కల్పించారు. ఈ నేపథ్యంలో రాచకొండ సీపీ మహేష్ భగవత్ ఆదేశాల మేరకు అమీర్‌పేటలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సంస్థ కరోనాపై ఇచ్చిన శిక్షణకు ఆయన హాజరయ్యారు. అక్కడ నేర్చుకున్న విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావించిన సీఐ నాగమల్లు పాటరూపంలో ప్రజలకు అవగాహన కల్పించాలని అనుకున్నారు. నాగమల్లు స్వయంగా రాసి, ఆలపించిన ఈ వీడియో సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. ఫేస్‌బుక్, ట్విటర్, వాట్సాప్, యూట్యూబ్ సహా ఒక్కరోజులోనే పదివేలమందికి చేరువైందని నాగమల్లు తెలిపారు. పాటను విన్న వారంతా ‘‘శభాష్ పోలీసన్న’’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
సీఐ నాగమల్లు రాసి, పాడిన పాట
భయపడవద్దండి భద్రత పాటిద్దాం.. కలిసికట్టుగా కరోనా అరికట్టేద్దాం..!
పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే చాలు.. వ్యక్తిగత శుభ్రత చేస్తుంది మేలు..!
జ్వరము దగ్గు జలుబు శ్వాసలో ఇబ్బందులుంటే..
డాక్టర్‌ను సంప్రదించి కారణాలు తెలుసుకోండి..!
కరోనా అంటూ మీరు కంగారు పడవద్దు.. నివారణ తెలుసుకొని మసులుకుంటే ముద్దు.
ముఖంపైన దగ్గకుండా పక్కకు తల తిప్పండి..
తుమ్మెస్తే ఆరు ఫీట్ల దూరం పాటించండి..!
కడగకుండా గ్లాసులోన నీళ్లను తాగొద్దు..
హలో కంటే నమస్కారమే ఇప్పుడు ముద్దు..!
కడగనట్టి చేతులతో కళ్లను రుద్దవద్దు..
ముక్కు, నోరును చేతితో ముట్టుకోకు ప్రతిసారి..!
అన్నం తినే ముందర చేతులను శుభ్రపరుచు..
జాగ్రత్తలు పాటిస్తే తగ్గుతుంది నీకు ఖర్చు..!
మంది ఎక్కువున్నకాడ మాస్కులనే ధరించాలి..
ప్రతిసారి సబ్బుతోని చేతులను కడగాలి..!
అవగాహనతో కరోనా అంతం చేద్దాం రండి..
వదంతులు నమ్మవద్దు వందనాలు మీకండీ..!
Tags: CI Nagamallu, sing a Song, Corona Virus, LB Nagar, Commissionerate of Rachakonda, Awareness