రిటైర్‌మెంట్‌పై స్పందించిన క్రిస్‌ గేల్‌..

by Anukaran |
రిటైర్‌మెంట్‌పై స్పందించిన క్రిస్‌ గేల్‌..
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ క్రికెట్‌లో క్రిస్ గేల్ ఒక సంచలనం. క్రీజులోకి యూనివర్స్ బాస్ దిగాడంటే సిక్సుల మోత మోగాల్సిందే. టెస్టు క్రికెట్‌ అయినా, వన్డే క్రికెట్, టీ20 క్రికెట్‌ అయినా తనదైన శైలిలో విధ్వంసం సృష్టిస్తాడు. ఐపీఎల్‌‌లో గేల్‌ ఆట అందరినీ ఆకట్టుకుంటోంది. 41 ఏళ్ల వయస్సున గేల్‌ తన రిటైర్‌మెంట్‌‌ వార్తలపై ఆసక్తికరంగా స్పందించాడు. ‘క్రికెట్‌ నుంచి మీరెప్పుడు రిటైర్‌మెంట్‌ అవుతున్నారని’ ఒక మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు వెరైటీగా సమధానం ఇచ్చాడు. ‘ఇప్పట్లో రిటైర్‌మెంట్‌ అనే ప్రస్తావనే లేదు. నేను ఇంకో ఐదేళ్లు క్రికెట్‌లో కొనసాగాలని ఉంది. నాకు 45 ఏళ్ల వయస్సు వచ్చే వరకూ రిటైర్‌ అవ్వను. కాబట్టి నేను ఇంకో రెండు వరల్డ్‌ కప్‌‌లు (టీ20, వన్డే) సులభంగా ఆడగలను’ స్పష్టం చేశాడు.

Advertisement

Next Story

Most Viewed