కూతుళ్లను కొట్టి చంపి.. ఈ ఒక్కరోజు ఆగండి పిల్లలు తిరిగివస్తారన్న తల్లిదండ్రులు

by srinivas |   ( Updated:2021-01-24 21:30:05.0  )
కూతుళ్లను కొట్టి చంపి.. ఈ ఒక్కరోజు ఆగండి పిల్లలు తిరిగివస్తారన్న తల్లిదండ్రులు
X

దిశ,వెబ్‌డెస్క్: చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. భక్తి పిచ్చి ఎక్కువై తల్లిదండ్రులు కన్నకూతుళ్లను దారుణంగా హత్య చేశారు. హత్య అనంతరం ఈ ఒక్కరోజు ఆగండి పిల్లలు తిరిగి వస్తారని నిందితులు చెప్పడంపై పోలీసులతో పాటు స్థానికులు షాక్ తిన్నారు.
భక్తిపిచ్చి పరాకాష్టకు చేరింది. చిత్తూరు జిల్లా మదనపల్లె టీచర్స్ కాలనీకి చెందిన తల్లి పద్మజ మాస్టర్స్ మైండ్స్ కాలేజీ కరెస్పాండెంట్‌, ప్రిన్సిపాల్‌గా, తండ్రి పురుషోత్తమనాయుడు మదనపల్లె ఉమెన్స్ కాలేజీ ప్రిన్సిపల్‌ గా పని చేస్తున్నారు. వారికి అలేఖ్య (27), సాయి దివ్య (22) ఇద్దరు కుమార్తెలు. అలేఖ్య భోపాల్ లో మేనేజ్మెంట్ ఆఫ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌లో చదవగా, చిన్నమ్మాయి బీబీఏ చదివి.. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహహాన్ ఇనిస్టిట్యూట్‌లో ట్రైనింగ్ తీసుకుంటోంది. అయితే గతకొద్దిరోజులుగా ఆధ్యాత్మిక సేవలో తీవ్రంగా మునిగిపోయారు. దీంతో బాలికల దినోత్సవం రోజు పురుషోత్తమనాయుడు, పద్మజలు కన్నకూతుళ్లు అలేఖ్య,సాయిదివ్యను ఇంట్లో ఉన్న డంబెల్స్ తో దారుణంగా హత్య చేశారు. ఈ దారుణం జరిగే సమయంలో పెద్దగా అరుపులు వినపడడంతో ఉలిక్కిపడ్డ స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Next Story