- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ పోలీసులో మాతృమూర్తిని చూశా: చిరు
మదర్స్ డే సందర్భంగా ప్రముఖులంతా తమ సోషల్ మీడియా హాండిల్ లో మాతృమూర్తికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తల్లితో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ.. తమ పుట్టుకకు కారణమైన కన్న తల్లికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఉన్నత శిఖరాలకు ఎదిగిన తమ జీవితంలో అమ్మ పాత్ర గురించి అభిమానులతో పంచుకుంటున్నారు.
అయితే మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఒక పోలీసు కఠిన గుండెలోనూ అమ్మ ప్రేమను చుసానంటూ వీడియో పోస్ట్ చేశాడు. మన తల్లి గురించి మనం చెప్పుకోవడం గర్వంగా, గొప్పగా ఉంటుంది.. అది మామూలే. అయితే ఈసారి మరో తల్లి గురించి ఈ మాతృమూర్తుల దినోత్సవం రోజున పంచుకోవడం ఆనందంగా ఉందని చెప్తున్నారు చిరు. ఒక తల్లి మరో తల్లి మీద కురిపించిన ప్రేమ గురించి షేర్ చేసుకున్నారు. ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అయిన వార్త చూసి చలించిపోయారట చిరు. ఒక లేడీ పోలీసు అంగవైకల్యంతో మతిస్థిమితం లేకుండా రోడ్డు పక్కన పడి ఉన్న ఓ అనాధ నోటికి ఆప్యాయంగా అన్నం ముద్దలు కలిపి తినిపిస్తున్న దృశ్యం నా హృదయాన్ని తాకిందన్నారు. కరోనా కారణంగా ఒక మనిషి మరో మనిషిని ముట్టుకునేందుకు భయపడుతున్న ఈ రోజుల్లో ఆ అభాగ్యూరాలిని అక్కున చేర్చుకుని ఆమె ఆకలి తీర్చడం గొప్ప విషయం అన్నారు. అలా తినిపించడంలో మానవత్వం, మాతృత్వం కనిపించిందన్నారు. పోలీసులు కఠినంగా ఉంటారు అని చెప్పే వాళ్లు ఈ వీడియో చూసి వారిలోనూ కారుణ్యం ఉంటుందని అర్థం చేసుకుంటారు అన్నారు చిరు.
ఆ వీడియో చూశాక ఎలాగైనా ఆ పోలీసు ఆఫీసర్ ను కలిసి అభినందించాలి అనుకున్నాను అని.. తన వివరాలు తెలుసుకున్నాను అని చెప్పారు. లేడీ ఆఫీసర్ సుభాషిణి తో ఫోన్ కాల్ మాట్లాడి అభినందించినట్లు తెలిపారు. మంచి మనసున్న ప్రతీ వ్యక్తి ఒక అమ్మేనని… అందరు తల్లులకు మదర్స్ డే శుభాకాంక్షలు చెప్పారు.
Even in the most challenging situations, there is no #Lockdown to the motherly instincts. Saluting ALL the Mothers in the world #HappyMothersDay pic.twitter.com/LpqDS8bbDO
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 10, 2020