- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
థాంక్యూ మై డియర్ బాలయ్య : చిరు
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వాలు శతవిధాల ప్రయత్నిస్తున్నాయి. ప్రజలను ఇళ్లకే పరిమితం చేసి కోవిడ్ 19 మహమ్మారి నుంచి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలో తమ వంతు సహకారం అందిస్తున్నారు ప్రముఖులు. ఇప్పటికే సినీ తారలు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు, సినీ కళాకారులకు అండగా నిలిచేందుకు విరాళాలు అందించగా… నందమూరి నటసింహం బాలకృష్ణ ముందుకొచ్చారు. మొత్తంగా రూ. 1.25 కోట్ల విరాళాన్ని అందించారు. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధికి రూ. 50 లక్షల చొప్పున విరాళం అందించిన బాలయ్య బాబు…. కరోనా క్రైసిస్ చారిటీకి రూ. 25 లక్షలు అందించారు.
Thank you dear brother #Balayya #NBK for donating 25 lacs to #CoronaCrisisCharity & 50 lacs each to Telangana & AP Govts. You proved ur generous heart goes out to the needy every time.ప్రతి కష్టసమయంలోను,ప్రజలను ఆదుకోవటం కోసం సినీ పరిశ్రమ ఒక్కటిగా ముందుకొస్తే,మీరెప్పుడు తోడుంటారు pic.twitter.com/9IWMw3ovMn
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 3, 2020
బాలకృష్ణ సినీ కార్మికులను ఆదుకునేందుకు ముందుకు రావడాన్ని ప్రశంసిస్తూ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు మెగాస్టార్ చిరంజీవి. నీది ఉదార హృదయమని మరోసారి నిరూపించావు… థాంక్యూ మై డియర్ బ్రదర్ అని తెలిపారు. కష్టసమయంలో ప్రజలను ఆదుకునేందుకు సినీ పరిశ్రమ ముందుకొస్తే ఎప్పుడూ తోడుంటావని ప్రశంసించారు.
Tags : Balakrishna, Chiranjeevi, Donation, CoronaVirus, Covid 19