- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మొక్కలు నాటిన చిరంజీవి, పవన్
దిశ, న్యూస్‌బ్యూరో: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా అదివారం జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ, జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ ఆధ్వర్యంలో ఛైర్మన్ నరేంద్ర చౌదరి నాయకత్వంలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌కుమార్‌తో కలిసి సొసైటీ ప్రాంగణంలో మెగాస్టార్ చిరంజీవి, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, డైరెక్టర్లు బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం గొప్పగా ముందుకు దూసుకుపోతుందని అన్నారు. మొక్కలు నాటి ఆకుపచ్చ భారతాన్ని అందించడమే మన భావితరాలకు అందించే గొప్ప సంపద అని, మొక్కలు మనం ఇచ్చే కాలుష్యాన్ని పీల్చుకొని మనకు ప్రాణవాయువు అందిస్తున్నాయన్నారు. జూబ్లీహిల్స్ సొసైటీ లక్ష మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని వారికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు ముఖ్యంగా మెగా అభిమానులందరూ కూడా మొక్కలు నాటాలని అదే మనం ఈ భూమికి తిరిగి ఇచ్చే ప్రతి ఉపకారం అని తెలిపారు.