కేసులే కాదు.. మనసులను గెలిచిన ‘వకీల్ సాబ్’

by Jakkula Samataha |
కేసులే కాదు.. మనసులను గెలిచిన ‘వకీల్ సాబ్’
X

దిశ, సినిమా : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ ‘వకీల్ సాబ్’ సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ క్రమంలో కుటుంబంతో సహా ఫస్ట్ డే సినిమా చూసిన మెగాస్టార్ చిరంజీవి.. తమ్ముడు పవన్ మీద ప్రశంసల వర్షం కురిపించారు. మూడేళ్ల తర్వాత కూడా మళ్లీ అదే వేడి, అదే వాడి, అదే పవర్‌తో పవన్ ఎంట్రీ అదిరిపోయిందన్నారు.

ప్రకాశ్‌రాజ్‌తో కోర్టు రూమ్ డ్రామా అద్భుతంగా ఉందన్న చిరు.. నివేదా థామస్, అంజలి, అనన్య తమ పాత్రల్లో జీవించారని అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్, డీఓపీ వినోద్ సినిమాకు ప్రాణం పోశారన్న మెగాస్టార్.. డైరెక్టర్ వేణు శ్రీరామ్, నిర్మాతలు దిల్ రాజు, బోనీ కపూర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అన్నిటికి మించి మహిళలకు ఇవ్వాల్సిన గౌరవాన్ని తెలియజేసే అత్యవసర చిత్రంగా ‘వకీల్ సాబ్‌’ను అభివర్ణించిన చిరు.. వకీల్ సాబ్ కేసులనే కాదు, అందరి మనసులనూ గెలిచాడని తెలిపారు.

https://twitter.com/KChiruTweets/status/1380747319402844165?s=20

Advertisement

Next Story