- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చిరు సినిమాలో త్రిష ఔట్.. కాజల్ ఇన్?
దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ మూవీ నుంచి హీరోయిన్ త్రిష తప్పుకున్నట్లు స్పష్టం చేసింది. దీంతో చిరు ఖైదీ నం. 150 చిత్రంలో జోడికట్టిన కాజల్ మరో సారి చిరుతో ఆడిపాడనుందని తెలుస్తోంది. డైరెక్టర్ కొరటాల శివ తనే బెస్ట్ ఆప్షన్ అనే నిర్ణయానికి వచ్చినట్లు టాలీవుడ్ టాక్. కాజల్ ప్రస్తుతం ‘మోసగాళ్లు’, ‘ఇండియన్ 2’, సినిమాలతో పాటు ‘ముంబై సాగా’, ‘హేయ్ సినామిక’ చిత్రాలతో బిజీగా ఉంది. ఇలాంటి సమయంలో చిరు సినిమాకు డేట్స్ సర్దుబాటు చేసుకుంటుందా? లేదా? చూడాలి మరి. ‘ఇండియన్ 2’ సినిమా చిత్రీకరణ దాదాపు ఆగిపోవడంతో ఆ సినిమా డేట్స్ ఆచార్యకు కలిసి వచ్చే అవకాశం లేకపోలేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు ‘ఆచార్య’లో విద్యార్థి నేతగా కనిపించనుండగా.. తనకు జోడిగా పూజా హెగ్డే ఆల్మోస్ట్ కన్‌ఫాం అయినట్లు సమాచారం. దేవాదాయ భూముల ఆక్రమణ నేపథ్యంలో సాగే సినిమాను రామ్ చరణ్ తేజ్ నిర్మిస్తున్నాడు.
Tags: Megastar Chiranjeevi, Trisha, Kajal Agarwal, Acharya, Koratala Siva