చిరుకు మెగా గిఫ్ట్ ఇవ్వనున్న ఫ్యాన్స్

by  |
Chiranjeevi
X

‘అన్నయ్య.. అందరివాడు.. ఆపద్బాంధవుడు’.. మెగాస్టార్ చిరంజీవిని అభిమానులు ఇలాగే పిలుచుకుంటారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా టాలీవుడ్‌ను ఏలుతున్న చిరుకు అభిమానులు కోకొల్లలు. అలాంటి చిరు పుట్టినరోజంటే ఫ్యాన్స్‌కు పెద్ద పండగే. అయితే కరోనా నేపథ్యంలో ఈసారి సెలబ్రేషన్స్ చేసే చాన్స్ లేదు కాబట్టి.. సోషల్ మీడియా వేదికగానే చిరుకు మెగా గిఫ్ట్ ఇవ్వబోతున్నారు ఫ్యాన్స్.

దేశంలో ఇంతకు ముందు కనీవినీ ఎరగని రీతిలో సోషల్ మీడియాలో సెలబ్రేషన్స్ స్టార్ట్ చేయబోతున్నారు. ఆగస్ట్ 22న చిరు పుట్టినరోజు కాగా.. ఇందుకు సంబంధించిన మోషన్ పోస్టర్‌ను విడుదల చేయబోతున్నారు. అది కూడా దేశంలో ఉన్న అన్ని సినీ ఇండస్ట్రీలకు చెందిన 65 మంది ప్రముఖ సెలబ్రిటీలతో చిరు బర్త్ డే పోస్టర్ రిలీజ్ చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కాగా.. #ChiruBdayFestBegins హాష్ ట్యాగ్‌తో ఆల్రెడీ ట్రెండింగ్‌లో ఉంది. సైరా సినిమా టైటిల్ సాంగ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో అదిరిపోయింది వీడియో.



Next Story

Most Viewed