మోడీ గారు.. బేటీ బచావో అంటే ఇదేనా? : సింగర్ చిన్మయి

by Jakkula Samataha |
మోడీ గారు.. బేటీ బచావో అంటే ఇదేనా? : సింగర్ చిన్మయి
X

దిశ, సినిమా : సింగర్ చిన్మయి శ్రీపాద ఏ విషయమైనా ఓపెన్‌గా మాట్లాడేస్తుంది. ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, లైంగిక వేధింపుల గురించి తన వాయిస్ వినిపించేందుకు ముందుంటుంది. కోలీవుడ్ రచయిత వైరముత్తు, నటుడు రాధా రవిలపై మీటూ ఆరోపణలు చేసిన చిన్మయి.. డబ్బింగ్ యూనియన్ ప్రెసిడెంట్ రాధా రవి కావాలనే తనను తమిళ సినిమాలకు డబ్బింగ్ చెప్పకుండా బ్యాన్ చేశారని ఆరోపించిన విషయం తెలిసిందే.

కాగా, తాజాగా తమిళనాడులో బీజేపీ క్యాంపెయినింగ్ లిస్ట్‌లో రాధా రవి పేరు ఉండడంపై మండిపడింది చిన్మయి. ట్విట్టర్ వేదికగా బీజేపీ లీడర్స్ క్యాంపెయిన్ లిస్ట్ షేర్ చేసిన ఆమె.. ‘బేటీ బచావో’ అంటే ఇదేనా? అని కేంద్రాన్ని ప్రశ్నించింది. మహిళా సాధికారత, మహిళల ఆత్మగౌరవం, మహిళలను కాపాడటం అంటూ లెక్చర్లు ఇచ్చే బీజేపీ నేతలు ఇలాంటి వారిని ప్రచారానికి ఉపయోగించడం వెనుకున్న ఆంతర్యం ఏంటో చెప్పాలని డిమాండ్ చేసింది.

Advertisement

Next Story