నన్ను వదిలేయండి ప్లీజ్.. తమిళులకు చిన్మయి అభ్యర్థన

by Jakkula Samataha |
నన్ను వదిలేయండి ప్లీజ్.. తమిళులకు చిన్మయి అభ్యర్థన
X

దిశ, సినిమా : మనోజ్ బాజ్‌పాయ్, సమంత అక్కినేని ప్రధానపాత్రల్లో నటించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్ సూపర్ సక్సెస్ అందుకుంది. అదిరిపోయే రేటింగ్స్‌తో దూసుకుపోతుంది. కానీ అదే సమయంలో తమిళుల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో సింగర్ చిన్మయి శ్రీపాద.. తన ఫ్రెండ్ సమంత అక్కినేనిని ప్రశంసిస్తూ పెట్టిన పోస్ట్ వివాదానికి దారితీసింది. సిరీస్‌లో సామ్ యాక్టింగ్‌ గురించి కాంప్లిమెంట్స్ ఇస్తూ పెట్టిన పోస్ట్‌పై తమిళులు ఫైర్ అయ్యారు. దీనిపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అసభ్యకరమైన కామెంట్స్ చేశారు. దానికి స్పందించిన చిన్మయి.. ‘ ద్వేషాన్ని ఎదుర్కునే సమయంలో నిశ్శబ్దంగా ఉండేందుకు చాలా స్ట్రెంత్ కావాలి. కానీ ప్రతీదానికి ఒక లిమిట్ ఉంటుంది. సమంత ఒక రాక్ స్టార్. అలాంటి వ్యక్తిని అప్రిషియేట్ చేసేందుకు పెట్టిన ఒక పోస్ట్‌కు ఇంత వ్యతిరేకత ఎందుకు? నేను ద్వేషంతో అలసిపోయాను. దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయండి’ అని పోస్ట్ పెట్టింది.

Advertisement

Next Story

Most Viewed